ICC WTC Final‌ Team: పాండ్యా, భూవికి నో చాన్స్‌

ICC WTC Final‌: సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో -భారత జట్టు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్ ఆడ‌నున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2021-05-07 15:03 GMT

టీం ఇండియా ఫైల్ ఫోటో 

ICC WTC Final‌ Team: సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో -భారత జట్టు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్ ఆడ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బ్లాక్ క్యాప్స్ తో త‌ల‌ప‌డే టీమిండియాను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు కూడా ఇదే జట్టును కొనసాగించనున్నారు. మొత్తం 18 మంది ప్రాబబుల్స్‌తో కూడిన జట్టును అధికారికంగా బీసీసీఐ ప్ర‌క‌టించింది.

జూన్‌ 18 నుంచి 22 వరకు 5 రోజులపాటు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ జరగనుంది. విరాట్ కోహ్లి కెప్టెన్‌గా.. అజింక్య రహానే వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ జ‌ట్టులో హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, పృథ్వీ షాలకు చోటు దక్కలేదు. ఐపీఎల్ లో ఫామ్ లోకి వ‌చ్చిన‌ పృథ్వీ షాను బీసీసీఐ ప‌క్క‌న పెట్టింది. సీనియ‌ర్ ఆట‌గాడు బౌల‌ర్ భువనేశ్వర్‌ కుమార్‌కు చోటుక‌ల్పించ‌లేదు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు నిరాశే మిగిలింది. తెలుగు కుర్రాడు హనుమ విహారి తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ముగిసిన తర్వాత భార‌త్- ఇంగ్లండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ సిరీస్‌ జరగనుంది. కాగా రిషబ్‌ పంత్‌కు బ్యాకప్‌గా కేఎల్‌ రాహుల్‌, వృద్దిమాన్‌ సాహాల పేర్లు పరిశీలించనప్పటికి బీసీసీఐ ప్రకటించిన జాబిత‌లో వారి పేర్లు లేవు.

బీసీసీఐ ప్ర‌క‌టించిన జ‌ట్టు ఇదేః

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్య రహానే (వైఎస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, విహారి, రిషబ్‌ పంత్(వికెట్‌ కీపర్‌)‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా, ఇషాంత్‌ శర్మ, షమీ, సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్‌‌, ఉమేష్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా.



Tags:    

Similar News