New Zealand vs India, 2nd Test :రెండో టెస్టులోనూ టీమ్‌ఇండియా ఓటమి

Update: 2020-03-02 03:02 GMT
New Zealand vs India (File Photo)

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్ లో 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 36.0 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీనితో న్యూజిలాండ్ జట్టు 2-0 తో సిరీస్ ని కైవసం చేసుకుంది.

90/6తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియా మరో 34 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బాట్స్ మెన్స్ హనుమ విహారి(9), రిషభ్‌ పంత్‌(4), మహ్మద్‌ షమి(5), జస్ప్రీత్‌ బుమ్రా(4) వెంటవెంటనే వెనుదిరిగారు. జట్టులో జడేజా(16) ఒక్కడే నాటౌట్‌ గా నిలిచాడు. దీనితో కివీస్‌ ముందు భారత్ 132 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఇక తిరిగి రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించిన కివీస్ జట్టు 36.0 ఓవర్లలలో లక్ష్యాన్ని చేధించింది. కివీస్ బాట్స్ మెన్స్ లో విలియమ్సన్ (5) , టామ్‌బ్లండెల్‌(55) , టామ్‌ లాథమ్ 52 (74), రాస్ టేలర్ (5), హెన్రీ నికోల్స్‌(5) పరుగులు చేశారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది న్యూజిలాండ్‌.. దీనితో భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 242 పరుగులకి ఆలౌట్ కాగా, కివీస్ జట్టును 235 పరుగులకి ఆలౌట్ చేసి ఏడూ పరుగుల ఆధిక్యతను సంపాదించుకుంది. ఇక తిరిగి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత బాట్స్ మెన్స్ కివీస్ బౌలర్ల ముందు నిలదొక్కుకోలేకపోయారు. దీనితో 124 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక ఇదే జట్టుతో జరిగిన అంతకుముందు జరిగిన టీ 20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసిన భారత్, వన్డే, టెస్ట్ సిరీస్ లలో మాత్రం దారుణంగా విఫలం అయి వైట్ వాష్ కి గురైంది.భారత్ వరుస ఓటములను ఫ్యాన్స్ జిర్ణించుకోలేకపోతున్నారు.  ఇక భారత్ సొంత గడ్డపై మార్చ్ 12 నుంచి సౌత్ఆఫ్రికా తో మూడు వన్డేల సిరీస్ ను ఆడనుంది.

Tags:    

Similar News