SRH vs KKR: సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్..

SRH vs KKR: కోల్కతాపై హైదరాబాద్ ఘనవిజయం

Update: 2023-04-15 02:15 GMT

SRH vs KKR: సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్..

SRH vs KKR: తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాల అనంతరం పంజాబ్‌పై గెలిచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో బోణీ కొట్టిన హైదరాబాద్‌.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం కనబర్చింది. బ్యాటర్లు దంచికొట్టడంతో భారీ స్కోరు చేసిన సన్‌రైజర్స్‌.. బౌలింగ్‌లోనూ రాణించి లీగ్‌లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో హైదరాబాద్‌ 23 పరుగుల తేడాతో కోల్‌కతాను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' హ్యారీ బ్రూక్‌ (55 బంతుల్లో 100 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఈ సీజన్‌లో తొలి సెంచరీతో చెలరేగగా, కెప్టెన్‌ మార్క్‌రమ్‌ (26 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.

Tags:    

Similar News