IPL 2021: ఐపీఎల్-14 సెకండ్ ఫేజ్‌లో చెన్నై శుభారంభం
IPL 2021: ముంబైపై 20 పరుగుల తేడాతో ధోనీ సేన గెలుపు
20 పరుగుల తేడాతో చెన్నై విజయం (ఫైల్ ఇమేజ్)
IPL 2021: ఐపీఎల్-14 సీజన్ సెకండ్ ఫేజ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. ముంబయి ఇండియన్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ సీజన్ తొలి దశలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. చెన్నై నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లలో సౌరభ్ తివారీ 50 పరుగులు చేయగా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు, దీపక్ చాహర్ రెండు, హేజిల్ వుడ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.