'బుట్టబొమ్మ' పాటకు భార్యతో కలిసి వార్నర్ డ్యాన్స్
ఈ ఏడాది ఆరంభంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..
ఈ ఏడాది ఆరంభంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇక ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతం పెద్ద హైలెట్ గా నిలిచింది. అందులో ముఖ్యంగా 'బుట్టబొమ్మ' సాంగ్ బాగా క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ పాటకు బన్ని, పూజా హెగ్డె వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి.
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా ఈ పాటకు ఫిదా అయిపోయాడు.. తన భార్య క్యాండిస్‌తో కలిసి బుట్టబొమ్మ పాటకి డాన్స్ చేశాడు. వీళ్ళు డాన్స్ చేస్తుంటే వెనకాల తన కూతురు వచ్చింది. ఈ పాటకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయింది. ఇక ఇటీవల తీస్మార్ ఖాన్ సినిమాలోని షీలా కీ జవానీ పాటకు తన కూతురుతో కలిసి వార్నర్ డాన్స్ చేసిన సంగతి తెలిసిందే..
అయితే వార్నర్-క్యాండిస్‌ల డ్యాన్స్‌పై అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. ధ్యాంక్యూ వెరీ మచ్' అంటూ ట్వీట్ చేశాడు. ఇక చిత్ర నిర్మాణ సంస్థలో ఒకటైనా గీతా ఆర్ట్స్ ఈ వీడియోను తమ అధికారిక ట్విటర్లో షేర్ చేస్తూ 'బుట్టబొమ్మ' పాట సరిహద్దులను చెరిపివేసిందంటూ ట్వీట్ చేసింది. ఇలా మరోసారి బుట్టబొమ్మ పాట ట్రెండింగ్ నిలిచింది. ఇక ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించగా, జానీ మాస్టర్ కంపోజ్ చేశారు.
అల.. వైకుంఠపురములో సినిమా తరవాత అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20వ చిత్రం కాగా, సుకుమార్ తో మూడవ చిత్రం.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.