Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డిని అభినందించిన చంద్రబాబు, విక్టరీ వెంకటేశ్

Chandra Babu - Nitish Reddy: భారత్-ఆస్టేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.

Update: 2024-12-28 08:54 GMT

Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డిని అభినందించిన చంద్రబాబు, విక్టరీ వెంకటేశ్

Chandra Babu - Nitish Reddy: భారత్-ఆస్టేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. నాలుగో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన విశాఖ యువకుడు కె.నితీశ్ కుమార్ రెడ్డికి నా అభినందనలు. టెస్టు మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కావడం మరింత సంతోషం కలిగిస్తోందన్నారు. రంజీలో ఆంధ్రా తరపున ఎన్నో విజయాలు సాధించిన నితీశ్ కుమార్ రెడ్డి.. అండర్ 16లో కూడా అద్భుత విజయాలు అందుకున్నాడు. అలాంటి మరిన్ని సెంచరీలు సాధించాలని.. భారత క్రికెట్ జట్టుకు చక్కటి ప్రదర్శన చేసి దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

హీరో వెంకటేష్ సైతం నితీశ్ కుమార్ పై ప్రశంసల జల్లు కురిపించారు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ సాధించాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి టెస్ట్ సిరీస్‌తోనే నితీశ్ అద్భుత ప్రదర్శన చాలా గర్వంగా ఉందన్నారు వెంకటేశ్.


Tags:    

Similar News