IPL 2025: ఐపీఎల్‌లో ఎన్నడూ చూడని క్యాచ్.. దుష్మంత చమీరా అద్భుతం!
IPL 2025: ఐపీఎల్ అంటేనే సంచలనాల సమాహారం. టీ20 క్రికెట్ అంటేనే అద్భుతాలకు నిలయం. బ్యాటర్లు సిక్సర్లతో విరుచుకుపడటం, బౌలర్లు మెరుపు వేగంతో వికెట్లు తీయడం మనం చూస్తూనే ఉంటాం.
IPL 2025: ఐపీఎల్‌లో ఎన్నడూ చూడని క్యాచ్.. దుష్మంత చమీరా అద్భుతం!
IPL 2025: ఐపీఎల్ అంటేనే సంచలనాల సమాహారం. టీ20 క్రికెట్ అంటేనే అద్భుతాలకు నిలయం. బ్యాటర్లు సిక్సర్లతో విరుచుకుపడటం, బౌలర్లు మెరుపు వేగంతో వికెట్లు తీయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఐపీఎల్ 2025లో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో ఒక ఫీల్డర్ చేసిన విన్యాసం మాత్రం అందరి హృదయాలను గెలుచుకుంది. గాల్లోకి ఎగిరి, ఒంటి చేత్తో అతను పట్టిన క్యాచ్ చూస్తే ఇది కలలో కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది. ఈ అద్భుత క్షణం కెమెరాల్లో బందీ అవ్వడంతో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
మ్యాచ్‌లో టాస్ గెలిచి ఢిల్లీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ బ్యాటర్లు ధాటిగా ఆడుతూ 200 పరుగుల మార్క్‌ను దాటేశారు. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. ఢిల్లీ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్‌లో ఒకానొక బంతిని కేకేఆర్ బ్యాటర్ అనుకూల్ రాయ్ స్క్వేర్ లెగ్ దిశగా బలంగా బాదాడు. బంతి బౌండరీ దాటుతుందని అంతా భావించారు.
కానీ అక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రీలంక స్టార్ దుష్మంత చమీరా మెరుపు వేగంతో కదిలాడు. బంతిని అందుకోవడానికి అతను గాల్లోకి ఒక అద్భుతమైన డైవ్ చేశాడు. క్షణాల్లో ఒంటి చేత్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. చమీరా చేసిన ఈ అసాధారణ ఫీల్డింగ్ కేవలం ఆరు పరుగులను ఆపడమే కాకుండా, స్టార్క్‌కు ఒక కీలకమైన వికెట్‌ను కూడా అందించింది. ఈ క్యాచ్ చూసిన ప్రత్యర్థి బ్యాటర్లు సైతం నోరెళ్లబెట్టారు.
మొత్తానికి ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్, నరైన్ మంచి ఆరంభాన్ని ఇవ్వగా, రహానే, రఘువంశి, రింకూ సింగ్ కూడా విలువైన పరుగులు చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం దుష్మంత చమీరా పట్టిన ఆ అద్భుతమైన క్యాచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.