Wolf Super Moon 2026: పుష్య పౌర్ణమి వుల్ఫ్ సూపర్ మూన్ ఈ 3 రాశులకు అదృష్టం
2026 తొలి వుల్ఫ్ సూపర్ మూన్ పుష్య పౌర్ణమి రోజున దర్శనం. ఈ అరుదైన పౌర్ణమి ప్రభావంతో వృషభ, సింహ, ధనస్సు రాశుల వారికి అదృష్టం, లాభాలు పెరిగే అవకాశం.
Wolf Super Moon 2026: పుష్య పౌర్ణమి వుల్ఫ్ సూపర్ మూన్ ఈ 3 రాశులకు భారీ అదృష్టం
ఈ రోజు పుష్య పౌర్ణమి సందర్భంగా ఆకాశంలో అరుదైన ఖగోళ విశేషం చోటుచేసుకోనుంది. 2026 సంవత్సరంలో తొలి పౌర్ణమిగా నమోదవుతున్న ఈ రోజు చంద్రుడు సాధారణ పౌర్ణమితో పోలిస్తే మరింత పెద్దగా, అధిక కాంతితో దర్శనమివ్వనుంది. ఈ ప్రత్యేక పౌర్ణమిని ఖగోళ శాస్త్రంలో "వుల్ఫ్ సూపర్ మూన్ (తోడేళ్ల పౌర్ణమి)" గా పిలుస్తారు.
ఖగోళ నిపుణుల సమాచారం ప్రకారం, ఈ సూపర్ మూన్ సాధారణ పౌర్ణమితో పోలిస్తే సుమారు 14 శాతం పెద్దగా, 30 శాతం వరకు ఎక్కువ ప్రకాశంతో కనిపించనుంది. భూమికి చంద్రుడు అత్యంత సమీపంగా ఉన్న సమయంలో పౌర్ణమి రావడం వల్ల ఈ అరుదైన దృశ్యం ఏర్పడుతుంది.
‘వుల్ఫ్ మూన్’ అనే పేరు వెనుక కూడా ప్రత్యేక కథ ఉంది. ఉత్తర అమెరికా ప్రాంతాల్లో శీతాకాలంలో ఆహారం కోసం తోడేళ్లు ఎక్కువగా మూలుగుతాయని అక్కడి ప్రజల విశ్వాసం. ఈ కారణంగా జనవరిలో వచ్చే పౌర్ణమికి వుల్ఫ్ మూన్ అనే పేరు వచ్చింది.
ఇక పుష్య పౌర్ణమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు విష్ణువు, లక్ష్మీదేవి ఆరాధన, సత్యనారాయణ వ్రతం, ఉపవాసం చేయడం శుభప్రదమని నమ్మకం. నల్ల నువ్వులు, బియ్యం, పాలు, వెండి, వస్త్రాలు వంటి వాటిని దానం చేస్తే చంద్ర దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. శివారాధన, హరే కృష్ణ మహామంత్ర జపం, భగవద్గీత పఠనం కూడా విశేష ఫలితాలను ఇస్తాయని విశ్వాసం.
జ్యోతిష్య పరంగా చూస్తే, ఈ వుల్ఫ్ సూపర్ మూన్ ప్రభావంతో మూడు రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి ఫలితాలు లభించే అవకాశముందని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు.
ఈ రోజు అదృష్టం కలిసివచ్చే మూడు రాశులు
వృషభ రాశి:
ఈ రోజు వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు రావచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉండటంతో పాటు వ్యాపారులకు అనుకూల సమయం.
సింహ రాశి:
సింహ రాశి వారికి ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త అవకాశాలు తలుపుతడతాయి. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలమైన రోజు.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి ఈ రోజు కీలక ప్రాజెక్టులు విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. మానసికంగా సంతోషం, ఉత్సాహం అధికంగా ఉంటుంది.