Daily Horoscope 14 February 2026: నేడు శుక్రుడి యోగం.. వాలెంటైన్స్ డే నాడు ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదుగా!
Daily Horoscope 14 February 2026: వాలెంటైన్స్ డే వేళ మీ రాశి ఫలం ఎలా ఉంది? నేడు శతభిషా నక్షత్రంలో శుక్రుడి సంచారం ఏ రాశుల వారికి ప్రేమ, సంపదను ఇస్తుంది? మేషం నుంచి మీనం వరకు ఫిబ్రవరి 14 నాటి రాశి ఫలాలు ఇక్కడ చూడండి.
Daily Horoscope 14 February 2026: నేడు శుక్రుడి యోగం.. వాలెంటైన్స్ డే నాడు ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదుగా!
Daily Horoscope 14 February 2026: ఫిబ్రవరి 14, 2026.. ప్రేమికుల దినోత్సవం వేళ గ్రహాల స్థితిగతులు ఆసక్తికరంగా మారాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రేమకు కారకుడైన శుక్రుడు శతభిషా నక్షత్రంలో సంచరిస్తుండటం, సూర్య-బుధులు కుంభరాశిలో కలిసి ఉండటం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు జరగనున్నాయి.
నేటి ద్వాదశ రాశి ఫలాలు ఇవే:
మేషం: ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగులేని పురోగతి కనిపిస్తుంది. అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది.
వృషభం: గురుగ్రహ అనుగ్రహం వల్ల శుభవార్తలు వింటారు. కొత్త పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం.
మిథునం: కొత్త వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. పనుల్లో వేగం పెరుగుతుంది.
కర్కాటకం: ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
సింహం: సమాజంలో మీ గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో అధికారుల మద్దతు మీకు పూర్తిస్థాయిలో లభిస్తుంది.
కన్యా: దూరప్రయాణాలకు అవకాశం ఉంది. ఉద్యోగ రీత్యా మీరు చేసే మార్పులు శుభ ఫలితాలను ఇస్తాయి.
తులా: రాశ్యాధిపతి శుక్రుడి ప్రభావంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో మధుర క్షణాలు గడుపుతారు.
వృశ్చికం: అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టవచ్చు. అయితే, సాయంత్రం నాటికి ఒక తీపి కబురు మీలో ఉత్సాహాన్ని నింపుతుంది.
ధనుస్సు: మీరు వేసే కొత్త ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది.
మకరం: పనుల్లో చిన్నపాటి జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. సహనం వహిస్తే అనుకున్న ఫలితాలు సాధ్యమవుతాయి.
కుంభం: సూర్య-బుధుల కలయిక వల్ల మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. నాయకత్వ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
మీనం: శని ప్రభావం వల్ల క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది.