Guru Gochar 2026: గురు గోచారం హోలీ తర్వాత ఈ రాశులపై గురుబలం ప్రభావం
హోలీ తర్వాత గురు గోచారం కారణంగా తులా, మేష, కన్య, ధనుస్సు రాశుల వారికి గురుబలం పెరిగి కెరీర్, ఆదాయం, అదృష్టంలో శుభఫలితాలు కలగనున్నాయి.
Guru Gochar 2026: గురు గోచారం హోలీ తర్వాత ఈ రాశులపై గురుబలం ప్రభావం
జ్యోతిష్యం ప్రకారం హోళి తర్వాత దేవగురువు బృహస్పతి ప్రత్యక్ష సంచారం చేయనున్నట్లు జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మిథున రాశిలో తిరోగమనంలో ఉన్న గురుడు మార్చి 13 తర్వాత సక్రమంగా సంచారం ప్రారంభించనున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి గురుబలం పెరిగి శుభఫలితాలు కలగనున్నాయని చెబుతున్నారు. ఈ సంచారం ప్రభావంతో కెరీర్, వ్యాపారం, ఆర్థిక పరిస్థితుల్లో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య విశ్లేషణలో వెల్లడైంది.
తులా రాశి వారికి గురు మహాదశ ప్రభావం కారణంగా ఉద్యోగ రంగంలో గుర్తింపు పెరగడంతో పాటు ఆదాయ వనరులు విస్తరించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం ఏర్పడనుంది. విదేశీ ప్రయాణ యోగం కూడా కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మేష రాశి వారికి గురు సంచారం సానుకూల ఫలితాలను అందించనుంది. కుటుంబ సహకారం పెరగడంతో పాటు వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే సూచనలు ఉండగా, పూర్వీకుల ఆస్తి సంబంధిత ప్రయోజనాలు కూడా కలగవచ్చని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
కన్య రాశి వారికి గురు ప్రత్యక్ష సంచారం కీలక మార్పులకు దారితీయవచ్చు. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరగడంతో పాటు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు ఇది అనుకూల కాలంగా భావిస్తున్నారు.
ధనుస్సు రాశి వారికి గురు సంచారం వల్ల పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా చిక్కుకున్న డబ్బు తిరిగి లభించే సూచనలు ఉండగా, ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది. అలాగే భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ఇది అనుకూల సమయంగా పేర్కొంటున్నారు.
గమనిక: పై సమాచారం జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది.