Ugadi Special 2024: ఉగాది అంటే ఏమిటీ.. క్రోధి నామ సంవత్సరం గురించి తెలుసుకోండి..!

Ugadi Special 2024: తెలుగువారి మొదటి పండుగ ఉగాది. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు.

Update: 2024-04-06 14:00 GMT

Ugadi Special 2024: ఉగాది అంటే ఏమిటీ.. క్రోధి నామ సంవత్సరం గురించి తెలుసుకోండి..!

Ugadi Special 2024: తెలుగువారి మొదటి పండుగ ఉగాది. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈ రోజున ఉగాది పచ్చడి తాగి దినచర్య మొదలుపెడుతారు. “ఉగ” అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్షు అని అర్థం. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు ఉగాది. ఉగస్య ఆది అనేదే ఉగాది. ఇంకొక విధంగా చెప్పాలంటే 'యుగం' అనగా రెండు లేక జంట అని అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయణాల ద్వయ సంయుతం యుగం (సంవత్సరం) కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయింది.

ఉగాది రోజు ప్రతి ఒక్కరూ ఏడు రుచుల పచ్చడిని తయారుచేసి తాగి రోజును ప్రారంభిస్తారు. ఇందులో తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న సూచిస్తూ ఉగాది పచ్చడిని తీసుకుంటారు. ఈ పచ్చడి కోసం చెరకు, అరటిపండ్లు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 9న చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి మంగళవారం రోజున ఉగాది పండుగ వస్తుంది. కలియుగం ప్రారంభమై 5,125వ సంవత్సరం అయిందని పండితులు చెబుతున్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో ప్రజలు కోపం, ఆవేశంతో వ్యవహరిస్తారని అంటున్నారు. కుటుంబసభ్యుల మధ్య, దేశంలో రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కోపావేశాలు, యుద్ధ వాతావరణం సూచనలు అధికంగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

Tags:    

Similar News