వినాయకుడి పూజలో తులసి ఎందుకు వాడరో తెలుసా?

Update: 2019-08-29 09:10 GMT

వినాయక చవితి నాడు అనేక పత్రాలను, పూలను తీసుకువచ్చి పూజిస్తాము. ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వ దేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవడానికి కారణం.... ఓసారి గంగాతీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మద్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనటంతో దర్మదజ్వ రాజపుత్రిక కోపించి, దీర్గకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది.

ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్గ కాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మద్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా, వినాయకుడు శాంతించి, రాక్షసుని చెంత కొంత కాలం ఉండి, ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు. అందుకే వినాయకుడు తులసిని తన పుజాపత్రిలో ఇష్టపడడు.

Tags:    

Similar News