శుభతిథి - చరిత్రలో ఈ రోజు

Update: 2019-06-04 18:30 GMT
 శుభతిథి 


వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.05-06 -2019 బుధవారం

సూర్యోదయం: ఉ.5-40; సూర్యాస్తమయం: సా.6.48

వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ పక్షం

విదియ : మ.12:03 తదుపరి తదియ

ఆరుద్ర నక్షత్రం: రా.11:55

అమృత ఘడియలు: మ.12:26 నుంచి 01:57 వరకు

వర్జ్యం: ఉ. 07:07 నుంచి 08:59




చరిత్రలో ఈ రోజు - 05.06.2019 - బుధవారం 
సంఘటనలు  

ప్రపంఛ పర్యావరణ దినోత్సవం

 ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా నడపబడుతుంది. ఈ రోజున మానవ పర్యావరణం పై ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభించింది. 1972 జూన్ 5 వ తేది నుంచి 16 వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవమును జూన్ 5 తేదిన వేర్వేరు నగరాలలో విభిన్న రీతులలో అంతర్జాతీయ వైభవంగా జరుపుకుంటున్నారు.

మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడినరోజు. 1972 స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడింది.

జననాలు  

రావి నారాయణరెడ్డి 1908

కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. (మ.1991)

చెన్నుపాటి విద్య 1934

భారత పార్లమెంటు సభ్యురాలు మరియు సంఘ సేవిక.

ఆచార్య ఎస్వీ రామారావు 1941

పి.హెచ్.డి. పరిశోధనా పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి పరిశోధనలు, 15 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.

రాయపాటి సాంబశివరావు 1943

భారత పార్లమెంటు సభ్యుడు.

రమేశ్ కృష్ణన్ 1961

భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.

మూరెళ్ల ప్రసాద్ 1968

ప్రముఖ తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు ఎక్కువగా తెలుగు మరియు కొన్ని తమిళ సినిమాలకు పనిచేశారు.

రంభ (నటి) 1976

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటి. ఈమె స్వస్థలం విజయవాడ

మరణాలు

మాధవ సదాశివ గోళ్వాల్కర్ 1973

గురూజీగా ప్రసిద్ధి చెందిన హిందుత్వ నాయకుడు.

ఆచార్య కుబేర్‌నాథ్ రాయ్ 1996

భారత రచయిత. (జ.1933) 

Tags:    

Similar News