శ్రీవారి మెల్ చాట్ వస్త్రాలకు రేపట్నుంచి ఈ వేలం

Update: 2019-08-19 05:25 GMT

తిరుమలలో శ్రీవారికి భక్తులు మెల్ చాట్, ఉత్తరీయాలను కానుకగా సమర్పిస్తుంటారు. వీటిని ఇప్పుడు వేలం ద్వారా విక్రయించాలని టీటీడీ భావిస్తోంది. రేపటి (మంగళవారం) నుంచి ఈ వస్త్రాలను ఆన్ లైన్ ద్వారా ఈ వేలం ప్రక్రియలో విక్రయానికి ఉంచనున్నారు. ఇదిలా ఉండగా ఈ ఉదయం 5 గంటల సమయానికి తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక, టైమ్ స్లాట్ దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం నాడు స్వామివారిని 95,722 మంది భక్తులు దర్శించుకున్నారు. 40,481 మంది తలనీలాలు సమర్పించారు. రూ. 2.49 కోట్ల ఆదాయం హుండీలో కానుకల ద్వారా లభించింది.


Tags:    

Similar News