తిరుమల సమాచారం

తిరుమల దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం వరలక్ష్మీవ్రతం, రెండో శనివారం, ఆదివారం, సోమవారం బక్రీద్‌ కారణంగా వరుస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.

Update: 2019-08-11 05:02 GMT

తిరుమల దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం వరలక్ష్మీవ్రతం, రెండో శనివారం, ఆదివారం, సోమవారం బక్రీద్‌ కారణంగా వరుస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి లేపాక్షి సర్కిల్‌ వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 26 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ్టి నుంచి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల కారణంగా సుప్రభాత సేవ మినహా ఇతర వారపు, నితయసేవలను అధికారులు రద్దు చేశారు. అర్చన, తోమాల సేవలను టీటీడీ ఏకాంతంగా నిర్వహించనుంది. మంగళవారం వరకు ఇదే రద్దీ కొనసాగే అవకాశాలున్నాయి. 

Tags:    

Similar News