తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం:చిరుజల్లులతో ఏడుకొండల పై ఆహ్లాదకర వాతావరణం

తిరుమల శ్రీవారి దర్శనానికి 22.10.2019 మంగళవారం సాధారణ స్థాయిలో భక్తులు ఉన్నారు. ఏడుకొండలపై ఉదయం నుంచి చిరు జల్లులు కురుస్తూ.. వాతావరణం మేఘా వృతమై ఆహ్లాదకరంగా ఉంది.

Update: 2019-10-22 03:26 GMT

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.... ఇవాళ మంగళవారం, నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం మూలవిరాట్టు పాదాలను బంగారు పుష్పలతో అర్చించే అష్టదళపాదపద్మారాధన అనే ప్రత్యేక వారపు సేవను అర్చకులు నిర్వహించారు...

ఇక రద్దీ తక్కువగా ఉండడంతో సర్వదర్శనానికి వెళ్లే భక్తులు 6 గంటల్లోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారు, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయంలో స్వామివారి దర్శనభాగ్యం పొందుతున్నారు... నిన్నటి రోజు సోమవారం 66,025 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 4.42 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది*, 23,908 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు....

కాగా ఉదయం నుండి చిరు  వర్షపుజల్లులు కురుస్తున్నాయి.  దీంతో కొండపైన‌ చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని భక్తులు ఆస్వాదిస్తున్నారు

Tags:    

Similar News