తిరుమలలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీ

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

Update: 2019-11-03 04:13 GMT

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది .... ఇవాళ అదివారం, స్వామివారి మూలవిరాట్టుకు నిత్యసేవలు మినహా ప్రత్యేకసేవలేవి ఉండవు..రద్దీ కారణంగా సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 18 గంటల సమయం, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు 5 గంటల సమయం పడుతొంది.

నిన్నటి రోజు శనివారం 85,662 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 2.51 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది, 37,998 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.

Tags:    

Similar News