అష్టలక్ష్మీ నమోస్తుతే...

హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం.

Update: 2020-01-19 06:36 GMT

హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం.

తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ప్రసిద్ధి గాంచిన అష్టలక్ష్మి ఆలయాల్లో మధురవాడ అష్టలక్ష్మి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం విశాఖ నగరంలోని కొమ్మాదిలో నెలకొని ఉంది. ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా అరుదైన భంగిమలో లక్ష్మి, శ్రీమనారాయణుల అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి. స్వామి, అమ్మవార్ల శిలా విగ్రహాల్ని మహాబలిపురం నుంచి, ఉత్సవ విగ్రహాన్ని తిరుపతి నుంచి తీసుకువచ్చి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ఆలయంలో లక్ష్మీనారాయణస్వామి శంఖు, చక్ర, గదా, కమలధారుడుకాగా, అమ్మవారు కమలం, వీణాధారిగా భక్తులకు ఆశీస్సులందిస్తుంటారు. గర్భగుడిలో విష్ణుమూర్తి లక్ష్మి దేవి కొలవై ఉండగా ఆలయానికి చుట్టుపక్కల అష్ట లక్ష్మి దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. క్షేత్ర పాలకునిగా ఆంజనేయస్వామి కొలువైయున్నారు.

ఆదిలక్ష్మి: "మహాలక్ష్మి" అనికూడా పిలుస్తారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.

ధాన్యలక్ష్మి: ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది.

ధైర్యలక్ష్మి: "వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించింది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకమే ధరించింది.

గజలక్ష్మి: నాలుగు చేతులు కలిగి, రెండు వైపులా రెండు గజాలు అభిషేకం చేస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించింది. రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.

సంతానలక్ష్మి: ఆరు చేతులు కలిగి ఉంటుంది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించింది. వడిలో బిడ్డ కలిగియున్నది. ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది.

విజయలక్ష్మి: ఎనిమిది చేతులు కలిగి ఉండి, ఎర్రని వస్త్రములు ధరించి ఉంటుంది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించింది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.

విద్యాలక్ష్మి: శారదా దేవి, చదువులతల్లి, చేతిలో వీణ ధరించి ఉంటుంది.

ధనలక్ష్మి: ఆరు హస్తాలు కలిగి ఉండి, ఎర్రని వస్త్రాలు ధరించింది. శంఖ చక్రాలు, కలశము, ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి.

ఈ ఆలయానికి వెళ్లిన భక్తుల కోరికలు అనుకున్న పనులు సకాలంలో తీరుతాయని భక్తులు చెపుతుంటారు. ఈ ఆలయానికి వెళ్లిన వారు

అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి

విష్ణు వక్షఃస్థలారూఢే భక్తమోక్ష ప్రదాయిని

శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

జగన్మాత్రేచ మోహిన్యై మంగళం శుభమంగళం

అనే ఈ స్తోత్రాన్ని పఠించినంతనే వారి కష్టాలన్నీ తొలిగిపోతాయని అక్కడి ప్రజలు చెపుతుంటారు. ప్రతి ఏటా దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు, శ్రావణమాస ఉత్సవాలు దీపావళి పర్వదినాన ధనలక్ష్మి పూజలు, కార్తీక మాస ఆరాధనలు, ధనుర్మాసంలో గోదా రంగనాథుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని, పెద్ద ఎత్తులో భక్తులు ఇక్కడిచి హాజరవుతారని ఆలయ అర్చకులు చెపుతుంటారు. అంతే కాక ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమినాడు లక్ష్మీనారాయణులను పంచామృతాలతో అబిషేకించడం విషేషంగా చెపుతుంటారు. దాంతో పాటుగానే అష్టలక్ష్మీ హోమం, లక్ష్మీనారాయణ హోమం, అష్టలక్ష్మీవ్రతాలను ఆలయంలో నిర్వహిస్తుంటారు. ఈ దేవాలయ దర్శించినంతనే సకల పాపాలు తొలిగి భక్తుల కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.  





Tags:    

Similar News