గాలిలో తేలే స్థంబం ఏ దేవాలయంలో ఉందో తెలుసా?

వీరభద్రస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా లేపాక్షి సమీపంలో 16వ శతాబ్దంలో నిర్మించబడింది.

Update: 2020-02-15 06:32 GMT

వీరభద్రస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా లేపాక్షి సమీపంలో 16వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ ఆలయం విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా చాతుర్యానికి గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం అధ్బుతమైన మండపాలతో అలాగే శిల్పకళా వైశిష్ట్యంతో అలరారుతూ ఉంటుంది.

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్ర స్వామి. ఈ దేవాలయంలో ఫ్రెస్కో చిత్రాలలో కాంతివంతమైన రంగుల అలంకరణలతో కూడుకొని ఉన్న రాముడు, కృష్ణుడు యొక్క పురాణ గాథలకు సంబంధించినవి ఉన్నాయి. అంతే కాక పెద్ద నంది విగ్రహం దేవాలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఏకరాతితో చెక్కబడి ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోని అతి పెద్ద విగ్రహాలలో ఒకటిగా అలరాలుతుంది.

బసవయ్య విగ్రహం

ఈ ఆలయంలో బసవయ్య విగ్రహం 15 అడుగులు ఎత్తు, 22 అడుగుల పొడుగున విస్తరించి ఉంది. ఇక్కడ గల పాపనశేశ్వర స్వామిని అగస్త్య మగర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి. ఒకరికి ఒకరు ఎదురుగా పాపనశేశ్వరుడు, రఘునతమూర్తి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు, రమణీయమైన ప్రదేశం. సీతమ్మవారిని అపహరించికొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని, రాములవారు జటాయువు చెప్పిన విషయమంత విని కృతజ్ఞతతో లే ! పక్షి ! అని మోక్షం పప్రాసదించిన స్థలం అని, అందువల్లనే క్రమంగా ఈ ప్రదేశం లేపాక్షి అయ్యింది అని స్థల పురాణం చెబుతుంది.

గాలిలో తేలే స్థంబం..

లేపాక్షి వీరభద్రుని ఆలయంలోని నాట్యమండపం దాదాపు 70 స్థంబాలతో నిర్మించబడింది. ఈ మండపంలోని అన్ని స్థంబాలు నేలను తాడి ఉన్నాయి కానీ ఆగ్నేయ దిశలోని ఓ స్థంబం మాత్రం నేలను ఆనకుండా గాలిలో తేలుతూ ఉంటుంది. ఇంత బరువున్నస్థంబం పై కప్పునుంచి అలా వేలాడడం అక్కడకి వచ్చే భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్థంబం నేలకు ఆనలేదు అనే విషయాన్ని స్పష్టం చేసుకోవడానికి ఉత్తర్యాన్ని స్థంబం కింద పరిచి బయటకు తీస్థారు. అయితే ఈ స్థంబం ఓ మూలకు కొద్దిగా నేలను ఆని ఉంటుంది. దీనికి కారణం 1903లో ఈ ఓ బ్రటిషు ఇంజనీర్ ఈ స్థంబాన్ని పరీక్షిస్తూ దాన్ని నేలకు ఆనేలా ప్రయత్నం చేసారు. అంతే స్థంబానికి పైకప్పు ఆధారంగా ఉన్న శీర్షాలన్నీ కదిలి పోయాయి.

ఈ స్థంబంతో పాటు పక్కనున్న మరికొన్ని స్థంబాల పైభాగాలు వాటి దిశను మార్చుకున్నాయి. అంతే కాకుండా నాట్య మండపం మధ్యలో ఉన్న భృంగీశ్వరుడు భిక్షాటన మూర్తి ఉన్న స్థంబాలు పై భాగాలు బాగా దగ్గరకు వచ్చాయి. దీంతో ఈ ఇంజనీరు ఈ స్థంభం మొత్తమే ఈ మండప భారాన్ని మోస్తుందని భావించి దాన్ని అలాగే వదిలేసారు. ఈ స్థంబాన్ని జరపడం వలన ఇతర స్థంబాల పైభాగం కదిలిన తీరును ఇప్పటికీ మనం గమనించవచ్చు . అలాగే స్థంబం పక్కకు జరిగిందనడాకి గుర్తుగా నేలపై ఓ గుర్తుకూడా ఉంటుంది. ఇక స్థంబం నేలకు ఆనకుండా ఉండడాన్ని చూడాలంటే మండపం కిందికిదిగి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా స్థంబం నేలకు ఆనకుండా పైకప్పు భారాన్ని ఎలా మోస్తుంది, మరి మిగతా 69 స్థంబాలు పైకప్పు భారాన్ని మోయడం లేదా అంటే ఇక్కడే ఆనాటి శిల్పులు వారి నిర్మాణ చాతుర్యాన్ని చూపించారు.

ప్రకృతి ఉపధ్రవాలు ఏమైనా వచ్చినప్పుడు నిర్మాణంలో ఏర్పడే ప్రకంపణల వలన మండపానికి ఎటువంటి నష్టం రాకుండా ఉండేందుకు ఈ స్థంబాన్ని ఒక తూకపు స్థంబంగా నిర్మించారు. అంటే ఈ మండపంలో ఎలాంటి ఉపధ్రవాలు వచ్చినా వాటిని ఈ స్థంబం భరిస్తుంది. దాని ప్రభావం మిగిలిన స్థంబాలపై పడకుండా ఉండేందుకు, దాని ద్వారు ఆ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉండేలా ఈ ఏర్పాటు చేసిఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఏ ఆలయంలోనైనా ఆ నాటి నిర్మాణ నైపుణ్యం చూపేందుకు శిల్పులు వివిధ పద్ధతులకు అవలంభించే వారని, వివిధ ఆలయాల్లో సూర్యకిరణాలు నేరుగా ఆలయాన్ని తాకే పద్ధతే ఇందుకు ఉదాహరణ అని అభిప్రాయమూ లేకపోలేదు. గురత్వాకర్షన సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా ఉపయోగించి దీన్ని నిర్మించారన్న అభిప్రాయమూ ఉంది. ఇక ఇంతటి ఆశ్చర్యకరమైన మండపాన్ని మీరూ వీక్షించండి.


Delete Edit


Tags:    

Similar News