శక్తి పీఠాల్లో రెండో శక్తి పీఠం ఎక్కడ ఉంది...

అష్టాదశ శక్తిపీఠాల్లో కాంచీపుర కామాక్షీ దేవి శక్తిపీఠం రెండవది. కాంచీపురం మోక్షదాయకమైన పట్టణాలలో ఒకటిగా ప్రసిద్ధి.

Update: 2020-03-21 03:17 GMT
Kanchipuram Kamakshi Devi Shakti Peeth

అష్టాదశ శక్తిపీఠాల్లో కాంచీపుర కామాక్షీ దేవి శక్తిపీఠం రెండవది. కాంచీపురం మోక్షదాయకమైన పట్టణాలలో ఒకటిగా ప్రసిద్ధి.కామాక్షీ దేవి ఆలయం కాంచీ పురంలో కొలువై ఉంది. తన కరుణామయైన కంటి చూపుతోనే భక్తుల కోర్కెలను తీర్చగలిగే మహాశక్తి. ఈ ప్రాంతంలో సతీదేవి వీపు భాగం పడినట్టు చెప్పే చెపుతుంటారు. "కామాక్షీ కామదాయినీ" అని లలితా సహస్రనామాలు పేర్కొన్నాయి. ఈ ఆలయాన్ని ఆరవ శతాబ్దంలో పల్లవ రాజవంశ రాజులు నిర్మించారని చరిత్ర చెపుతుంది. ఆలయంలో అమ్మవారు యోగముద్రలో పద్మాసనముపై కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ ఆలయం కొన్ని విపత్తుల కారణంగా కొంత చెదిరిందనే చెప్పుకోవాలి. దాంతొ ఆ ఆలయాన్ని పుణ:నిర్మాణం చేసారు. అమ్మను ఆరాధించి మూగవాడైన భక్తుడు వాక్కును సంపాదించుకొని అయిదు వందల శ్లోకాలతో అమ్మను కీర్తించాడు. శ్రీ కామాక్షి దేవాలయంలో అమ్మవారి గర్భాలయం వెనుక భాగంలో శ్రీ ఆదిశంకరుల ప్రతిమ ప్రతిష్ఠించబడింది.

శక్తిపీఠాం ఎలా వెలసింది...

దక్షుడు బృహస్పతియాగం చేసినపుడు దేవతలందరినీ ఆహ్వానించి శివపార్వతులని పిలవలేదు. అయినా పార్వతీ దేవి శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది. కానీ అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు దర్శనమిస్తున్నాయి. అలా వెలసిందే శాంకరీదేవి శక్తిపీఠం.

మహావిష్ణువు పార్వతి శరీరాన్ని ఖండాలుగా చేసిన మయంలో సతీదేవి వీపుభాగం తమిళనాడులోని కంచి పడిందని చెపుతుంటారు. దీంతో ఇక్కడ కామాక్షీదేవి ఆలయాన్ని నిర్మించారని పూర్వీకుల వాదన. కొన్ని విపత్తుల కారణంగా ఆలయం కొంత మేరకు చెక్కుచెదిరింది. దాన్ని పుణ: నిర్మించారు.

దర్శన వేళలు:

ప్రతీరోజూ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ.. తిరిగి 4 గంటల నుంచి రాత్రి 8.30వరకు దర్శనం ఇస్తుంది అమ్మవారు.

ఎలా వెళ్లాలి:

కాంచీపురానికి బస్సు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం ద్వారా:

కాంచీపురానికి వెళ్లేందుకు ముందుగా కర్నూలు మీదుగా తిరుపతి చేరుకుని అక్కడ్నుంచి వెళ్లవచ్చు. తిరుపతి నుంచి కంచికి నేరుగా బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నేరుగా చెన్నై వెళ్లి అక్కడ్నుంచి కోయంబేడ్ బస్స్టేషన్ నుంచి కంచికి బస్సులో వెళ్లవచ్చు.

రైలు మార్గంలో వెళ్లాలంటే:

కర్నూలు మీదుగా చెన్నై వెళ్లే కాచిగూడ ఎగ్మోర్ ఎక్స్ప్రెస్, వారంలో ఒక్కసారి ఉండే స్పెషల్ ట్రైన్ ద్వారా వెళ్లొచ్చు. అరక్కోణం స్టేషన్లో దిగి అక్కడ్నుంచి కంచి వెళ్లాలి. చెన్నై వెళ్లి అక్కడ్నుంచి లోకల్ ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. మరోమార్గం తిరుపతికి నేరుగా ట్రైన్లో వెళ్లి అక్కడ్నుంచి పుదుచ్చేరి వెళ్లే రైలులో కంచికి వెళ్లవచ్చు. చెన్నై విమానాశ్రయం నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా కంచి వెళ్లవచ్చు.

Tags:    

Similar News