విజయాన్నిచ్చే వినాయకుడు

Update: 2019-05-19 03:10 GMT

పూజల్లో తొలిపూజ వినాయకునిదే. విఘ్ననాయకునిగా గణపతి ప్రసిద్ధి. విఘ్నేశ్వరుడు పలు రూపాల్లో పలు ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అటువంటి వాటిలో సుప్రసిద్ధమైనది శ్రీకాళహస్తి లోని పాతాళ వినాయకుని రూపం. శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం లో ధూర్జటి.. హరివిలాసంలో శ్రీనాధుడు ఈ వినాయకుని గురించి వివరించారు. భూమి లో దాదాపుగా 40 అడుగుల లోతులో ఈ విఘ్నరాజుడు కొలువై వున్నాడు. కాళహస్తి వెళ్లిన భక్తులు ఈ లంబోదరుడ్ని చూడకుండా రారు.

పాతాళంలో నివాసం ఏర్పరుచుకున్న ఈ విజయవినాయకుని గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం అగస్త్యుడు ఈ క్షేత్రంలో జీవనదిని ప్రవహింపజేయాలనే ఉద్దేశంతో పరమశివుడిని ప్రార్ధించాడు. స్వర్ణముఖి నది పాయ ఏర్పడింది కానీ అందులో నీళ్లు లేవు. వినాయకుడిని ప్రార్ధించకుండా ఈ కార్యానికి పూనుకోవడమే అందుకు కారణమని గ్రహించిన అగస్త్యుడు, ఆ స్వామిని ప్రార్ధించాడు. పాతాళ మార్గంలో అక్కడికి చేరుకున్న వినాయకుడు ఆ మహర్షి కోరికను నెరవేర్చాడు. అగస్త్యుడి కోరిక మేరకు ఆయనకి దర్శనమిచ్చిన చోటునే వెలిశాడు. ఇక్కడి వినాయకుడిని పూజించడం వలన ఆటంకాలు తొలగిపోయి విజయాలు కలుగుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

Similar News