తిరుమలలో రథసప్తమి వేడుకలు: శ్రీవారికి ప్రత్యేక బ్రహోత్సవాలు..

రథ సప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీవానిని ప్రత్యేకంగా అలంకరించి కైకర్యాలను నిర్వహించారు.

Update: 2020-02-01 08:27 GMT

రథ సప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీవానిని ప్రత్యేకంగా అలంకరించి కైకర్యాలను నిర్వహించారు. బ్రహ్మోత్సవ సమయంలో వారం రోజుల పాటు ఇక్కో వాహణం పైన శ్రీవారిని తిరుమాడ వీధుల్లో ఊరేగించినట్టుగానే, రథసప్తమి రోజున ఒకే రోజు అన్ని వాహన సేవలను నిర్వహిస్తారు.

రథసప్తమి ప్రత్యేక బ్రహ్మోత్సవ వేడుకలు ..

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేది రథసప్తమి కావడం, అందులోనూ శనివారం కావడం మరింత ప్రత్యేకతని సంతరించుకుంది. దీంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉద‌యం 5.30 గంట‌ల‌కు సూర్యప్రభ వాహనసేవ మొదలయింది. ఈ వాహణం పైన స్వామి వారు మలయప్ప అవతారంలో ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోద‌యాన భానుడి తొలికిర‌ణాలు మ‌ల‌య‌ప్ప‌స్వామివారి పాదాల‌ను స్ప‌ర్శించాయి. ఈ అద్భుతమైన ఘట్టాన్ని అక్కడి భక్తులు తనివితీరా చూసి ఆనందోత్సాహంలో పొంగిపోయారు. ఈ సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్న శ్రీవారిని దర్శించుకుంటే ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం లాంటి ఫలాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేషవాహనంపై శ్రీనివాసుడు దర్శనం ఇస్తారు.

ఉదయం 11 నుంచి 12 వరకు గ‌రుడ వాహన సేవ నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 1 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు హనుమంతు వాహన సేవ.

మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు శ్రీ‌వారి పుష్క‌రిణిలో చ‌క్ర‌స్నానం.

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీమలయప్పస్వామి ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

సాయంత్రం 6 నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై స్వామి విహరిస్తారు.

రాత్రి 8 నుంచి 9 వరకు చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు.

ఇక పోతే ఈ రథసప్తమి వేడుకలు సూర్యక్షేత్రం అరసవల్లిలోనూ వైభవంగా సాగుతున్నాయి. ప్రత్యక్ష దైవం సూర్యదేవుని దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు.


Full View


Tags:    

Similar News