ప్రముఖ పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ కన్నుమూత

Brahmarshi Patriji: రేపు సాయంత్రం పత్రిజీ అంత్యక్రియలు

Update: 2022-07-25 02:03 GMT

ప్రముఖ పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ కన్నుమూత

Brahmarshi Patriji: ప్రముఖ పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రీజీ (74) శివైక్యం చెందారు. కొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుండగా  రెండు రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను కడ్తాల్‌లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌ ధాన్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో కన్నుమూశారు. సోమవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు కడ్తాల్ లోని మహా పిరమిడ్ వద్ద నిర్వహించనున్నట్లు ట్రస్ట్‌ సభ్యులు వెల్లడించారు.

1947లో నిజామాబాద్‌లోని బోధన్ లో సుభాష్ పత్రీజీ జన్మించారు. ఇంతకుముందు ఆయన కర్నూల్‌లోని కోరమండల్‌ ఫెర్టిలైజర్స్‌ సంస్థలో పని చేశారు. 2012లో రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం అన్మాసుపల్లిలో మహేశ్వర మహా పిరమిడ్‌ను నిర్మించారు. అదే ఏడాది డిసెంబర్‌ 18 నుంచి జనవరి 31 వరకు ప్రపంచ ధ్యాన మహాసభలు నిర్వహించారు. ఆయన గతంలో పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియాను స్థాపించారు.

Tags:    

Similar News