Pradosha Kalam Secrets: ప్రదోషకాలం అంటే ఏమిటి? ఆ సమయంలో శివారాధన చేస్తే పాపాలు పటాపంచలవ్వడం ఖాయమా?
Pradosha Kalam Secrets: ప్రదోషకాలం అంటే ఏమిటి? శివుడికి ప్రదోష సమయం ఎందుకు అంత ప్రీతికరమైనది? ఆ సమయంలో శివారాధన చేయడం వల్ల కలిగే అద్భుత ఫలితాలు మరియు శాస్త్రం చెబుతున్న విశేషాల గురించి పూర్తి కథనం.
Pradosha Kalam Secrets: ప్రదోషకాలం అంటే ఏమిటి? ఆ సమయంలో శివారాధన చేస్తే పాపాలు పటాపంచలవ్వడం ఖాయమా?
Pradosha Kalam Secrets: హిందూ ధర్మంలో శివారాధనకు అత్యంత పవిత్రమైన సమయం 'ప్రదోషకాలం'. అసలు ప్రదోషం అంటే ఏమిటి? ఆ సమయంలోనే స్వామివారిని ఎందుకు పూజించాలి? అనే విషయాలను పురాణాలు స్పష్టంగా వివరిస్తున్నాయి.
ప్రదోషకాలం అంటే ఏమిటి?
సాధారణంగా సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య సమయాన్ని, అంటే పగలు ముగిసి రాత్రి ప్రారంభమయ్యే సంధ్యా సమయాన్ని 'ప్రదోషం' అంటారు. 'ప్రదోష' అంటే రాత్రి కాలం అని అర్థం. ఈ సమయంలో పరమశివుడు ప్రమథ గణాలతో కొలువై ఉంటాడని, ఆ సమయంలో చేసే పూజలు నేరుగా కైలాసనాథుడికి చేరుతాయని భక్తుల విశ్వాసం.
బుధ, గురువారాలు.. త్రయోదశి తిథుల ప్రత్యేకత:
తిథులలో త్రయోదశికి మన్మథుడు, చతుర్దశికి కలి పురుషుడు అధిపతులు. ఈ ఇద్దరినీ నియంత్రించే శక్తి ఒక్క శివుడికే ఉంది. అందుకే ఈ తిథుల్లో ప్రదోష పూజకు ప్రాధాన్యత ఉంది. అలాగే బుధ, గురువారాలు బుద్ధికి, వాక్కుకు సంకేతం కాబట్టి, విద్యార్థులు ఈ సమయంలో శివ పంచాక్షరీ ధ్యానం చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
పాప నిర్మూలనకు మార్గం:
ప్రదోషం అంటేనే పాప నిర్మూలన. మనిషి తెలిసీ తెలియక చేసే పాప కర్మల వల్ల జీవితంలో అనేక అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఈ అడ్డంకులు తొలగి పురోభివృద్ధి చెందాలంటే ప్రదోషకాలంలో శివుడిని స్మరించాలి. 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని జపిస్తూ, భక్తితో ఒక్క పువ్వు సమర్పించినా భోళాశంకరుడు సంతుష్టుడై కష్టాలను తొలగిస్తాడని భక్తుల నమ్మకం.