Karmanasa River: ఈ నీళ్లు ముట్టుకోవాలంటేనే భయపడుతోన్న జనం.. ఆ నది ఎక్కడో కాదు మనదేశంలోనే ఉందండోయ్..!

Karmanasa River: నదులకు ప్రపంచవ్యాప్తంగా జీవనాధార హోదా లభించింది. చరిత్ర పుస్తకాలను ఓసారి తిరగేస్తే చాలా నాగరికతలు నదుల ఒడ్డున స్థిరపడటంతోనే ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. భారతీయ సంస్కృతిలో నదులను తల్లిగా పరిగణిస్తారు. అంతే కాకుండా నదులను కూడా ఇక్కడ దేవతలా పూజిస్తారు.

Update: 2023-05-13 14:00 GMT

Karmanasa River: ఈ నీళ్లు ముట్టుకోవాలంటేనే భయపడుతోన్న జనం.. ఆ నది ఎక్కడో కాదు మనదేశంలోనే ఉందండోయ్..!

Karmanasa River: నదులకు ప్రపంచవ్యాప్తంగా జీవనాధార హోదా లభించింది. చరిత్ర పుస్తకాలను ఓసారి తిరగేస్తే చాలా నాగరికతలు నదుల ఒడ్డున స్థిరపడటంతోనే ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. భారతీయ సంస్కృతిలో నదులను తల్లిగా పరిగణిస్తారు. అంతే కాకుండా నదులను కూడా ఇక్కడ దేవతలా పూజిస్తారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పరిశ్రమలు, పనులలో నదుల ఉపయోగాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. నదులు లేని మానవ నాగరికతను ఊహించడం కూడా కష్టం. భారతదేశంలో చాలా నదులను పూజిస్తారు. అయితే కొన్ని నదులు మాత్రం ప్రజలను భయపడేలా చేస్తుంటాయి. దేశంలోని ఈ నదులు శాపగ్రస్తమైనవి అని నమ్ముతుంటారు. అలాంటి నదులలో ఒకటి కర్మనాస.

కర్మనాశ కథేంటి..

ఉత్తరప్రదేశ్‌లో కర్మనాస అనే నది ప్రవహిస్తుంది. దీని నీటిని సామాన్య ప్రజలు ఉపయోగించరు. ఈ నది శాపగ్రస్తమైందని నమ్ముతారు. ఎవరైనా దాని నీటిని ఉపయోగిస్తే, చెడు జరుగుతుందని భావిస్తున్నారు. దీని కారణంగా నేటికీ చాలా మంది కర్మనాషా నది నీటిని ఉపయోగించరు. కర్మనాశ అనేది కర్మ, నాశ అనే రెండు పదాలతో ముడిపడింది. మంచి పనులను కూడా నాశనం చేసేది అని అర్థం. సోన్‌భద్ర, చందౌలీ, వారణాసి, ఘాజీపూర్ గుండా ప్రవహించే ఈ నది బక్సర్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.

కర్మనాశ పురాణం..

ఈ నది హరిశ్చంద్ర రాజు తండ్రి సత్యవ్రత్ లాలాజలం నుంచి తయారైందని పురాణాలలో నమ్ముతారు. ఒకసారి సత్యవ్రత్ తన గురువైన వశిష్ఠునికి మానవ శరీరంతో స్వర్గానికి వెళ్లాలనే కోరికను వ్యక్తం చేశాడని, అయితే గురువైన వశిష్ఠుడు సత్యవ్రత్‌కు దానిని తిరస్కరించాడని చెబుతారు. సత్యవ్రతుడు గురు విశ్వామిత్రుని ముందు ఈ కోరికను వ్యక్తం చేశాడు. విశ్వామిత్రుడు తన తపస్సు శక్తితో సత్యవ్రతుని భౌతికంగా స్వర్గానికి పంపాడు. ఇంద్రుడు దీనికి చాలా కోపంగా ఉంటాడంట. అతను సత్యవ్రతుని శరీరాన్ని భూమి వైపు పంపాడంట. గురు విశ్వామిత్రుడు తన ధ్యాన శక్తితో సత్యవ్రత్ శరీరాన్ని స్వర్గానికి, భూమికి మధ్య నిలిపేశాడంట. దీని తరువాత ఇంద్రుడు, విశ్వామిత్రుల మధ్య పెద్ద యుద్ధం జరిగిందంట. ఈలోగా సత్యవ్రత్ శరీరం ఆకాశంలో తలక్రిందులుగా వేలాడుతూనే ఉందంట. దీంతో అతని నోటి నుంచి లాలాజలం రావడం ప్రారంభమైందంట. ఈ లాలాజలం నుంచి కర్మనాశ నది తయారైందని చెబుతుంటారు.

Tags:    

Similar News