నవ విధ భక్తి మార్గాలంటారు.. అవేంటో తెలుసా!!

Update: 2019-08-14 10:44 GMT

భక్తి ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించినది. అదేవిధంగా శైవులకు శివుడు, శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించినది. భక్తి యోగం గురించి భగవద్గీతలో వేదాంతాల సారంగా పేర్కొంది

" శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనమ్‌

అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనమ్‌ " ఇవీ నవ విధ భక్తి మార్గాలు

శ్రవణం :

మనకు ఉన్న సమయాన్ని దైవిక విషయాలను వినడం

కీర్తనం :

అందరికి అష్టోత్తరాలు, సహస్రనామాలు చదవడం రాకపోవచ్చు, వారు అలా బాధపడకుండా, కీర్తనల రూపంలో ఆరాధించవచ్చు.

స్మరణం :

కార్తీకపురాణం, విష్ణుపురాణం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం మొదలైనవి అన్ని స్మరణ మార్గంగా చెప్పవచ్చు.

పాదసేవ :

పాదసేవ కంటే మించినదిలేదు. గురువుగారి కి పాదసేవ, పాదపూజ చేయడం ద్వారా భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలం

అర్చనం :

మనం ప్రతినిత్యం చేసే విగ్రహారాధనే అర్చనం. దేవుడిని మనస్పూర్తిగా పూజించడం.

వందనం :

మనస్పూర్తిగా నమస్కరించడం.

సఖ్యం :

భగవంతుణ్ని మిత్రుడిగా భావించి అతని మహిమను, ఔన్నత్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో మెలగడమే సఖ్యత.

ఆత్మనివేదనం :

కామ క్రోధ మద మాత్సర్యాలను గెలిచి నిష్కామభావంతో ఆ దేవదేవుడిని పూజించాలి.

దాస్యం :

సర్వం ఆ భగవంతునికి అర్పించడమే దాస్యం.

యాంత్రిక కాలంలోపైన చెప్పిన శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం చేయడంద్వార భగవత్ నామస్మరణ చేయొచ్చు. ఇవి చేయడానికి సమయం సందర్భం అవసరం లేదు. మీకు ఒక్క నిమిషం సమయం ఉన్నా, ఇష్టమైన నామాన్ని స్మరించండి చాలు.

Tags:    

Similar News