గయ, బీహార్ : మంగళ గౌరి ఆలయం విశిష్టత

Update: 2020-03-30 09:00 GMT

గదాధర సహోదరి గయా గౌరి నమోస్తుతే పితృణాంచ సకర్తృణాం దేవి సద్గతిదాయిని

త్రిశక్తిరూపిణీమాతా సచ్చిదానంద రూపిణీ మహ్యంభవతు సుప్రీతా గయామాంగళ్యగౌరికా.

బీహార్: భారతదేశంలోని గయాలోని మంగల గౌరీ ఆలయం పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, శ్రీ దేవి భగవత్ పురన్ , మార్కండే పురాన్ ఇతర గ్రంథాలు, తాంత్రిక రచనలలో ప్రస్తావించబడింది. ఈ ఆలయం పద్దెనిమిది మహా శక్తిపీట్లలో ఒకటి. ప్రస్తుత ఆలయం 15 వ శతాబ్దానికి చెందినది. ఈ పుణ్యక్షేత్రం గయా యొక్క ప్రధానంగా వైష్ణవ తీర్థయాత్ర కేంద్రంలో సతీదేవికి అంకితం చేయబడింది. ఇక్కడ మంగళగౌరిని దయగల దేవతగా పూజిస్తారు. ఈ ఆలయం ఒక ఉపశక్తి పీఠాన్ని కలిగి ఉంది. ఇక్కడ సతీ యొక్క శరీరం యొక్క ఒక భాగం పురాణాల ప్రకారం పడిపోయిందని నమ్ముతారు. ఎవరైతే తన కోరికలతో అమ్మ వద్దకు వస్దారో వారి కోరికలు తీరి తిరిగి ఆలయానికి వస్తారని నమ్ముతారు.

ఈ మంగళగౌరి ఆలయాన్ని కొండపైన తూర్పు ముఖంగా నిర్మించబడింది. ఈ ఆలయం లోపల చిన్న గుంటకి చుట్టూ చతురస్రాకారపు దిమ్మె లాగా వుంటుంది. ఆ దిమ్మె మీద భక్తులు వెలిగించే దీపాలు అఖండ దీపంలా భక్తులు ప్రకాశిస్తూ వుంటాయి. ఆలయం గుంటలో అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాలగ్రామంలాగా వుంటుంది. దీన్నే మంగళగౌరీ దేవిగా భక్తులు పూజిస్తారు. ఆ ఆలయంలో ఎలక్ట్రిక్ దీపాలు వుండక పోవటంతో చీకటిగా ఉంటుంది. ఈ గర్భగుడి చక్కగా చెక్కిన పురాతన శిల్పాలను కలిగి ఉంది. ఆలయం ముందు ఒక చిన్న మండపం ఉంది. ఈ ఆలయం చుట్టుపక్కన మా కాళి, గణేశుడు, హనుమంతుడు, శివుడు ఆలయాలు ఉన్నాయి.

శక్తిపీఠాం ఎలా వెలసింది...

దక్షుడు బృహస్పతియాగం చేసినపుడు దేవతలందరినీ ఆహ్వానించి శివపార్వతులని పిలవలేదు. అయినా పార్వతీ దేవి శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది. కానీ అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు దర్శనమిస్తున్నాయి. అలా వెలసిందే మంగళగౌరి శక్తిపీఠం. మహావిష్ణువు పార్వతి శరీరాన్ని ఖండాలుగా చేసిన మయంలో సతీదేవి తొడభాగం బీహార్ లోని గయలో పడిందని చెపుతుంటారు.  

Tags:    

Similar News