చంద్రగిరి పుట్టలమ్మ ఆలయంలో ఘనంగా కార్తీక సోమవారం

విభూది అలంకరణలో పరమశివుడు, శతబ్దాల చరిత్ర కలిగి చంద్రగిరి శ్రీ శ్యామలాంబ సమేత మల్లేశ్వరస్వామి(పుట్టలమ్మ) ఆలయంలో ఘనంగా కార్తీక సోమవారం వేడుకలు జరిగాయి.

Update: 2019-11-04 04:39 GMT
temple

తిరుమల, శ్యామ్.కె.నాయుడు

విభూది అలంకరణలో పరమశివుడు, శతబ్దాల చరిత్ర కలిగి చంద్రగిరి శ్రీ శ్యామలాంబ సమేత మల్లేశ్వరస్వామి(పుట్టలమ్మ) ఆలయంలో ఘనంగా కార్తీక సోమవారం వేడుకలు జరిగాయి. పరమ పవిత్రమైన కార్తీక మాస రెండవ సోమవార సందర్భంగా పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులతో శైవక్షేత్రాలు, ఆలయాలు ఆధ్యాత్మిక వాతవరణం నెలకొంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి 12 కిమీ దూరంలో ఉన్న చంద్రగిరి ప్రాంతం తెలియని వారుండరు, ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతంలోనే కోటను నిర్మించుకొని విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ సమయంలో చంద్రగిరికి సమీపంలోని మల్లయ్యపల్లి కొండపై వెలసిన శివలింగానికి ప్రతి పౌర్ణమి నాడు ఘనంగా అభిషేకం నిర్వహించి పూజలు చేసేవాడని చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తొంది.

అంతటి మహిమాన్వితమైన పురాతన శివలింగాన్ని 1923 సంవత్సరంలో మలయాళస్వామి( శ్రీవ్యాస ఆశ్రమం స్థాపకుడు, ఏర్పేడు, చిత్తూరు జిల్లా,ఏపీ) తన స్వహస్తాలతో మల్లయ్యపల్లె కొండపై ఉండి ఎద్దులబండిలో చంద్రగిరి కి తరలించి ఓ ప్రాంతంలో ప్రతిష్టించాడు, లింగప్రతిష్ట చేసి ఆలయాన్ని నిర్మించిన ప్రాంతంలో ఓ పెద్ద నీళ్ల బావి , ఎక్కువసంఖ్యలో పాముపుట్టలు ఉండేవట, అందుచేత ఈ శివాలయం పుట్టాలమ్మ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. నాటి నుండి దినదినాభివృద్ధి చెందుతూ శ్రీశ్రీశ్రీ శ్యామలాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంగా నిత్యోత్సవాలతో అలరారుతొంది.

కార్తీకమాస ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ శ్యామలాంబ సమేత మల్లేశ్వరస్వామికి ఉదయం 03:30 గంటలకు రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు,‌ అనంతరం ఆ లయకారుడిని లింగాన్ని విభూదితో సుందరమనోహరంగా అలంకారించడంతో పురప్రజలు స్వామివారిని దర్సించుకొని పుణీతులవుతున్నారు.

పూజలలో భాగంగా మధ్యాహ్నం చందన అలంకారం చేయనున్నారు, సాయంత్రం 6 నుండి రాత్రి 8గంట వరకు భక్తులతో శివభజన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వహించనుంది. ఈ నెల 10 వ తేదీ త్రయోదశి, రేవతి నక్షత్రం పురస్కరించుకొని లక్ష దోపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

శ్రీశ్రీశ్రీ శ్యామలాంబ సమేత మల్లేశ్వరస్వామి(పుట్టాలమ్మగుడి) ఆలయం, ఆర్.ఎఫ్.రోడ్, కొత్తపేట, చంద్రగిరి

Tags:    

Similar News