వెలుతురుంటే చాలు ఈ ఆలయంలో అద్భుతాలు చూడవచ్చు

ఎన్నో ఏండ్ల చరిత్ర గల ఆలయాలు తెలంగాణ రాష్ట్రంలోనూ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయ రహస్యాలు మిస్టరీగానే ఉన్నాయి. వాలాంటి దేవాలయాలలో ఛాయా సోమేశ్వరాలయం ఒకటి.

Update: 2020-03-02 06:35 GMT

ఎన్నో ఏండ్ల చరిత్ర గల ఆలయాలు తెలంగాణ రాష్ట్రంలోనూ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయ రహస్యాలు మిస్టరీగానే ఉన్నాయి. వాలాంటి దేవాలయాలలో ఛాయా సోమేశ్వరాలయం ఒకటి. ఈ ఆలయం నల్లగొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు గ్రామంలోని ఉన్నది. సుమారు పదో శతాబ్దంలో పానగల్లుని రాజధానిగా చేసుకొని ప్రస్తుత నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలను పాలించిన కందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి కోసం నిర్మించిన ఆలయాలలో ఇది ఒకటి. అంతే కాదు ఆ ఆలయ సమీపంలో రాజులకు సంబంధించిన కోట తాలూకు శిథిలాలు కూడా ఉండడం గమనార్హం.

ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనం ద్వారా కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసారనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నది. పూర్వం గ్రామలలో, పట్టణాలలో వివాహాలకు, కచేరి, పండుగలకు ఎలాంటి శుభకార్యాలు జరపాలన్నా ఆలయాలలోనే నిర్వహించేవారు. అందుకే ఆ కాలం నాటి రాజులు వాటికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వాటిని ఎంతో అద్భుతమైన శల్పులతో నిర్మింపచేసేవారు. ఈ క్రమంలోనే ఈ ఆలయానికి నిశ్చలఛాయను అనుసంధానించారు.


ఆలయం ప్రత్యేకతలు

ఈ ఆలయంలో అంతుచిక్కని రెండు రహస్యాలు ఉన్నాయి. అందులో మొదటిది గర్బగుడిలో శివలింగము వెనుక వున్న గోడపై పగలు మొత్తం కనిపించే, సూర్యరశ్మితో సంభంధం లేని స్తంభాకార నీడ పడుతుంది. రెండోది ఆ ఆలయానికి చేరువలో ఉన్ననీళ్లు సంవృద్దిగా ఉంటే గర్బగుడిలో కూడా నీరు ఉబికి వస్తుంది. అదే కరువు వచ్చిన ఏడాది చెరువు ఎండితే గర్బగుడిలో నీరు కూడా ఎండిపోయేదని స్థానికులు తెలిపారు. అంతే కాదు అసలు ఈ నీడ ఎలా పడుతుంది అన్న విశేశాలు ఇప్పటి వరకూ ఎవరికీ తెలీదు.

ఊరికి దూరంగా ఒంటరిగా పొలాల మధ్య ఎలాంటి రాజగోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే మూడు గర్భాలయాలు గల ఈ త్రికూటాలయంలోని ఒక దాంట్లో శ్రీదత్తాత్రేయుడు కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది. తూర్పు ముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీసోమేశ్వర స్వామి దర్శనమిస్తారు. నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు. పూర్తిగా రాతి నిర్మాణం అయిన ఆలయంలో చాళుక్యుల శైలి కొంత కనపడుతుంది.

మండప స్థంభాలకు రామాయణ, భారత, శివలీలా ఘట్టాలు చెక్కారు. ద్వారపాలక విగ్రహాలు, గర్భాలయ ద్వారం పైనున్న తోరణానికి చెక్కిన సూక్ష్మరూప లతలు, పూలు ఆలయ బయటి గోడలపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి. లింగానికి ఎదురుగా నందీశ్వరుడు లేకున్నా, ద్వారానికిరుపక్కలా విఘ్నరాజు వినాయకుడు, నాగరాజు దర్శనమిస్తారు. ఆలయం ప్రాంగణంలో దాడులలో ధ్వంసం చేయబడిన నందులు, ఇతర శిల్పాలు కనుపించి హృదయాన్ని కలవర పరుస్తాయి. చుట్టూ ఉన్న ఉప ఆలయాలు చాలా వరకు ఖాళీగా ఉండగా, ఒక దాంట్లో మాత్రం ఆత్మలింగ రూపంలో లింగరాజు కొలువై ఉంటాడు.


ఈ ఆలయానికి పడమర ఉన్నటువంటి గర్భగుడిలో శిలింగం మీదుగా స్తంభాకారంలో ఏక నిశ్చల ఛాయ, సూర్యుని స్థానముతో సంబంధం లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు ఏర్పడడం ఈ ఆలయం సంతరించుకున్నటువంటి అద్భుతం. ఆ నీడ ఏ స్థంబంది అన్న విషయం అంతు చిక్కలేదు.

ఇక ఆలయ మధ్యభాగంలో చతురాశ్రాకారంలో ఉండి దానికి మూడువైపులా అంటే, తూర్పు, పడమర, ఉత్తరాన మూడు గర్భగుడులు కలిగి ఉంది. ఈ మూడు ఆలయాను ఒకే రీతిలో నిర్మించనప్పటికీ కేవలం పడమటి గర్భగుడిలో మాత్రమే ఏక నిశ్చల ఛాయను చూడగలము. ఆలయ శిల్పి ఉద్దేశ్యము ప్రకారం ఛాయ నిశ్చలంగా ఉండాలంటే తూర్పు లేదా పడమర ఛాయలను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటిని కలిపే తలము, తూర్పు నుండి పడమరకు సూర్యుడు ప్రయాణించే దిశకు సమాంతరంగా ఉంటుంది.

ఆలయ నిర్మాణం

ఆలయాన్ని రాళ్ళతో కూడిన పునాదులతో నిర్మించారు. దీంతో భవిష్యత్తులో భూకంపాల వంటి ఉపద్రవాలు వచ్చినా కూడా నీడ చెదరకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాడు ఆలయాన్ని నిర్మించినారు శిల్పులు. ఛాయా సోమేశ్వరాలయం కాకతీయుల కాలం నాటి నిర్మాణశైలిని కలిగి ఉంటుంది. ఆ కాలంలోనే భౌతిక శాస్త్రం ఆధారంగా కాంతిని దారిమళ్లించి ఒక నీడని గర్భగుడిలో పడేలా చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు భక్తులు.  




 


Tags:    

Similar News