శుభోదయం

Update: 2019-05-21 04:18 GMT

శుభ తిథి  

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం

తే.21-05-2019 - మంగళవారం

వసంత రుతువు: వైశాఖ మాసం:బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.5-30; సూర్యాస్తమయం: సా.6.22

తదియ:                    రా. 1-59 తదుపరి చవితి

మూల నక్షత్రం:          తె. 3-13 తదుపరి పూర్వాషాఢ

అమృత ఘడియలు:  రా.9-27 నుంచి 11-06 వరకు

వర్జ్యం:                      మ. 11-29 నుంచి 01-09 వరకు

                                తిరిగి రా 02-26 నుంచి 04.05 వరకు

దుర్ముహూర్తం:         ఉ. 08-04 నుంచి 08-56 వరకు

                                తిరిగి రా. 10-49 నుంచి 11-34 వరకు

రాహుకాలం:             మ. 3-00 నుంచి 4.30 వరకు 




చరిత్రలో ఈ రోజు 

♣ సంఘటనలు 

ప్రపంచ సాంస్కృతిక దినోత్సవము - నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ సాంస్కృతిక దినోత్సవము జరుపుకుంటారు.

మొట్టమొదటి 'సైకిల్' (రెండుచక్రాల వాహనం) ప్రవేశపెట్టినరోజు. 1819 మొట్టమొదటి 'సైకిల్' (రెండుచక్రాల వాహనం) (స్విఫ్ట్ వాకర్) ని అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రవేశపెట్టారు.

రాజీవ్ గాంధీ హత్య. 1991 మాజీ భారత ప్రధాన మంత్రిని, 'నళిని' అనే మహిళ తన నడుముకి కట్టుకున్న బాంబును పేల్చి ('ఎల్.టి.టి.ఇ' కి చెందిన ఆత్మాహుతి దళ సభ్యురాలు) హత్య చేసింది.

మిస్ యూనివర్స్  గా సుస్మితా సేన్ 1994 భారత దేశానికి చెందిన సుస్మితా సేన్,18 సంవత్సరాల వయసులో, 43వ మిస్ యూనివర్స్గా ఎన్నికైంది.

ఏకా ఆంజనేయులు 1893 ప్రముఖ సాహితీ పోషకుడు, భువనవిజయం సాహితీరూపక రూపశిల్పి.

 జననాలు 

అలెగ్జాండర్ పోప్. 1688 పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు మరియు తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (మ.1744)

భమిడి కమలాదేవి 1941 సంగీత విద్వాంసురాలు.

రాళ్ళబండి కవితాప్రసాద్ 1961 ప్రముఖ తెలుగు అవధాని, కవి. (మ.2015)

 మరణాలు  

కార్ల్ విల్‌హెల్మ్‌ 1786 జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (జ.1742)

కౌతా ఆనందమోహనశాస్త్రి 1940 వీరు వివిధ శైలీభేదాలను అనుసరించి నూటికి పైగా చిత్రాలను చిత్రించారు. (జ.1908)

రాజీవ్ గాంధీ: 1991 రాజీవ్ గాంధీ (ఆగష్టు 20, 1944 – మే 21, 1991), ఇందిరా మరియు ఫిరోజ్ గాంధీ ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రి (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి                          మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణముతో ప్రధానమంత్రి అయిన రాజీవ్ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది, రాజీనామా చేసే వరకు                     ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.శ్రీలంక దేశానికి చెందిన తమిళ                     తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు.

Similar News