భద్రాచలంలో పెరిగిన భక్తుల రద్దీ

భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో స్వామివారి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు.

Update: 2019-08-11 05:07 GMT

భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో స్వామివారి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. భద్రాచలంలో పవిత్రోత్సవాలు ఈ నెల 15వ తేదీ వరకు జరగనున్నాయి. భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుత నీటిమట్టం 35 అడుగుల మేర కొనసాగుతుంది. నిన్న సాయంత్రం 6గంటలకు 47.5 అడుగులకు తగ్గింది. ఇదిలా ఉండగా గోదావరి వరద ఉధృతి అమాంతంగా పెరగడంతో భద్రాచలం గోదావరి స్నానఘట్టాలు పూర్తిగా నీటమునిగాయి. కల్యాణకట్ట చుట్టూ నీరు చేరింది. నిత్యాన్నదానం చుట్టూ వరద నీరు చేరుకుంది. ఆలయ పడమెర మెట్ల వైపు ఉన్న బొమ్మల దుకాణాలు సైతం నీటమునిగాయి. దీంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. నిత్యాన్నదానం చుట్టూ వరద నీరు చేరడంతో భక్తులు కొంత ఇబ్బందులు పడ్డారు. 

Tags:    

Similar News