తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం : 4 గంటల్లోనే శ్రీవారి దర్శనం

ఇవాళ మంగళవారం, నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం మూలవిరాట్టు పాదాలను బంగారు పుష్పాలతో అర్చించే అష్టదళపాదపద్మారాధన అనే ప్రత్యేక వారపు సేవను అర్చకులు నిర్వహించారు.

Update: 2019-11-05 03:59 GMT
TIRUMALA BALAJI

తిరుమల, శ్యామ్.కె.నాయుడు

ఇవాళ మంగళవారం, నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం మూలవిరాట్టు పాదాలను బంగారు పుష్పాలతో అర్చించే అష్టదళపాదపద్మారాధన అనే ప్రత్యేక వారపు సేవను అర్చకులు నిర్వహించారు.

ఇక దర్శన విషయాలకొస్తే సర్వదర్శనానికి వెళ్లే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం  పడుతోంది, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు గంటన్నర, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్నటి రోజు సోమవారం 66,149 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 2.83 కోట్లు హుండీ ఆదాయం సమకూరింది.

Tags:    

Similar News