ఆంజనేయుడిని తమలపాకులతోనే ఎందుకు పూజించాలి?

Update: 2019-08-23 08:25 GMT

ఆంజనేయుడు నాగవల్లి ప్రియుడు. నాగవల్లి అనగా పాము పడగ వంటి ఆకారము కలిగిన దళములు - తమలపాకులు. ఇవి ఆయనకు ఎందుకిష్టమంటే దేవదానవులు క్షీరసాగర మధనం చేసిన సమయంలో కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, లక్ష్మీదేవి, కుశలు, కాలకూట విషము, అమృతము ఆపై నాగవల్లి పత్రములు గూడ ఉధ్భవించినవట. ఆ ఆకులు సేవించటం ఆరోగ్య భాగ్యానికి హేతువు. తమలములు తమ జన్మలో ఒక్కసారైనా నమలని జన్మ బహుశావుండదని వేమనశతకంలో వివరించెను. జీర్ణశక్తి, ఎముకలపుష్టి, వీర్యవృధ్ధి, ఆకలి కలిగించుట, జఠరాగ్ని రగిలించుట, పైత్యం, అరుచి మొదలైన ఔషధాలన్నీ తమలపాకుల్లో ఉన్నాయి.

అందుకే తమలపాకులతో ఆంజేయునికి దళార్చన చేయాలనుకునే వారు మూలం క్రింద వుండే విధంగా దళపై భాగం ముందునట్లుంచి పూజించవలెను. భక్తులు భగవంతునకు పత్రం, పుష్పం, ఫలం, ఉదకమైనా భక్తితో సమర్పించుట మంచిది. ఆంజనేయుని దేహము ఆకుపచ్చారంగులో నుండును - సుందరకాండలో వనములు తిరుగుచూ లంకాపురం చరించునప్పుడు అది రక్షణ కవచంగా కాపాడెను. కాబట్టి తమలపాకులతో స్వామిని అర్చిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.

Tags:    

Similar News