ఆధ్యాత్మిక చింతన అనేది శ్రీరామరక్ష

Update: 2019-08-10 10:52 GMT

ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరమైనప్పటికీ రాబోయే కాలం అంతా మంచే జరుగుతుందన్న ఆశావాద దృక్పథం అలవడుతుంది. దాంతో, చేసే పనిపై శ్రద్ధ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతనకు వయసుతో సంబంధం లేదు. ఏ వయసువారైనా నిక్షేపంగా దైవధ్యానాన్ని చేసుకోవచ్చు. దైవ ధ్యానంలో మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అంతేగాని, ఆధ్యాత్మిక చింతనని కేవలం వృద్ధులకు పరిమితం చేయకూడదు. అయితే, సాధారణంగా వయసైపోయిన కారణంగా చుట్టుముట్టే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కోసం ఆధ్యాత్మిక చింతనను దైనందిన జీవితంలో భాగంగా చేసుకుంటారు. కానీ, చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతనను దైనందిన జీవితంలో భాగముగా చేసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఆధ్యాత్మిక చింతనతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుని ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు. అందువలనే, ఆధ్యాత్మిక మార్గంలో పయనించమని ఎందరో మహానుభావులు సూచిస్తూ ఉంటారు. ఇష్టదైవ నామ స్మరణను చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆలయ దర్శనానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. 

Tags:    

Similar News