నెమళ్ల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు!

Update: 2019-08-01 15:15 GMT

నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే మైమరచి చూడాల్సిందే. అయితే మగ నెమలి.. ఆడనెమలిని ఆకర్షించేందుకు పురివిప్పి నాట్యం చేస్తుందంటారు. నెమలి పురివిప్పి నాట్యమాడుతుంటే అది చూడ్డానికి రెండు కళ్లు చాలవు. అలాగే నెమలి పించం కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేస్తుంది. నెమలి పించం ఇంట్లో ఉంటే.. రోజు వారీ జీవితంలో చాలా సమస్యల్ని పోగొడుతుందని పండితులు చెబుతుంటారు. పిల్లలు సరిగా చదవకపోయినా, చురుగ్గా ఉండకపోయినా.. వారికి నెమలి పించం ఇస్తే చాలు.. మార్పు వచ్చేస్తుందని భావిస్తారు.

ఇక నెమలి నాట్యం ఇష్టపడని వారుండరు. అయితే నెమళ్లు నాట్యం చేస్తే చూడటానికి చాల చక్కగా ఉంటుంది కానీ.. అలాంటి నెమళ్లు పదుల సంఖ్యలో ఊరిపై పడిపోయి,ఇంటి చుట్టూ గోల చేస్తుంటే మాత్రం కొందరకి చిరకుగా ఉంటుంది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ప్రజలు ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఇండియాలో కోతుల బెడదలా.. కెనడాలో కొన్ని గ్రామల్లోని ప్రజలను నెమళ్లు ఇబ్బందులు పెడుతున్నాయట. గ్రామాల్లో ఎక్కడ చూసినా నెమళ్లే కనిపిస్తుండడంతో వీటిని ఎలా వదిలించుకోవాలా అని స్థానికులు సతమతం అవుతున్నారు. ఇంక నెమళ్ల గుంపుల నుంచి వచ్చే దుర్గంధం స్థానికులను తీవ్ర ఇబ్బంది పెడుతోందని వారు వాపోతున్నారు. 

Tags:    

Similar News