పులివెందులలో వైసీపీకి గట్టి షాక్ – జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం, 30 ఏళ్లలో ఇదే తొలిసారి!

పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి షాక్, టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,052 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 30 ఏళ్లలో ఇదే తొలిసారి టీడీపీ విజయం!

Update: 2025-08-14 06:53 GMT

Pulivendula Shock for YSRCP – TDP’s Historic ZPTC Win After 30 Years!

వైసీపీ అడ్డా‌గా భావించే పులివెందుల‌లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ సంచలన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయంతో నిలిచారు. మొత్తం 6,052 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి డిపాజిట్ కోల్పోయేలా చేశారు.

పులివెందుల, మాజీ సీఎం జగన్ బలమైన కోటగా పేరొందిన ప్రాంతం. అయితే, ఈసారి పరిస్థితులు పూర్తిగా మారాయి. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,052 ఓట్ల తేడాతో విజయం సాధించగా, వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 30 ఏళ్లలో తొలిసారి, పులివెందుల జెడ్పీటీసీ స్థానం టీడీపీ ఖాతాలో చేరింది.

ఈ ఫలితం, రాబోయే ఎన్నికల దిశలో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Tags:    

Similar News