"ఒక గాభర పడని గాడిద కథ"

Update: 2019-03-20 16:50 GMT

ఫ్రెండ్స్ ….కొన్ని సందర్బాలలో మన బలహీనతల వల్ల లేదా ఇతరుల స్వార్ధం, మోసం, అనవసర విమర్శల వర్షం వల్ల మనం ఎన్నో సమస్యల్లో పడిపోవచ్చు...కాని ఆ సమయలో నిబ్బరంగా వుండి ఆ విమర్శల వర్షం తో కూడా మన లక్ష్యాల పంటని ఎలా పండించుకోవచ్చు..

"ఒక గాభర పడని గాడిద కథ"

జీవితంలో ప్రశంసల జల్లు కురిపించుకోవాలని అందరూ కోరుకుంటారు, కాని ఇతరుల విమర్శల వర్షానికే తట్టుకులేక చాల మంది కొట్టుకుపోతారు. శ్రీ.కో

ఒక రైతు దగ్గర ఒక ముసలి గాడిద ఉండేది. ఒకరోజు పొలం నుండి వస్తున్న ఆ గాడిదకి, దారి సరిగా కనబడక ఆ దారి పక్కనే వున్న పాడుబడ్డ భావిలో పడిపోయింది. అది చూసి రైతు ఆ గాడిదను పైకి తీసే ప్రయత్నం చేశాడు. కాని తీయటం కుదరలేదు.

చివరికి ''ఇది ముసలిదైపోయింది, నాకు ఎక్కువ కాలం ఎలాగు ఉపయోగపడదు. కాబట్టి దీన్ని కష్టపడి పైకి తీసే కన్నా, నేను మరో బలమైన గాడిదను తెచ్చుకోవడం మేలు అని అనుకొన్నాడు.

కాని అప్పుడు మరో ఆలోచన వచ్చింది...ఆ గాడిద కూడా దీనిలాగా ఈ బావిలో పడిపోతే మళ్లీ మరో గాడిద కొనుక్కోవాలి. ముసలి గాడిద ఎటూ పడిపోయింది కనుక, దీనిని మట్టితో కప్పేస్తే అప్పుడు బావి కూడా పూడిపోతుంది కనుక కొత్త గాడిద పడే సమస్య ఉండదు'' అనుకుని చుట్టుపక్కల రైతులకు విషయం చెప్పి సహాయానికి పిలిచాడు.

అతను చెప్పిన విషయం విని తలా ఒక తట్ట మట్టి తెచ్చి ఇతరులు పోస్తున్నారు. అది చూసినా గాడిద...తన యజమాని తనని కాపాడాల్సింది పోయి...ఇలా చేస్తున్నడేంటి "ఎంత దారుణం" "ఎంత మోసం"అని గాడిద చాల భాద పడసాగింది. తన వీపు మీద పడుతున్న మట్టి దెబ్బలను భరిస్తూ....ఇక్కడి నుండి తప్పుకునే మార్గాన్ని చూసుకుంటాను అనుకుంది.

ఒకసారి సంకల్పం చేసుకున్నాక ధైర్యం వచ్చి లోపల గోడకు బాగా దగ్గరకు వెళ్లి నిలబడింది. పైనుంచి మట్టి పోస్తున్నారు. అందులో తనమీద పడిన దాన్ని దులుపుకుంటున్నది. పక్కన పడ్డ మట్టి ఒక దిబ్బగా మారగానే దాని మీదకు చేరుతున్నది.

అలా లోపల మట్టి లెవల్ పెరిగే కొద్దీ అది కూడా పైకి జరుగుతూ..జరుగుతూ...అలా బావి పైఅంచు దగ్గరకు రాగానే, ఒక్కసారి శక్తి కూడదీసుకుని బావి బయటకు దూకి పారిపోయింది. అలా ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కోలేకపోయి ఉంటే, ఆ గాడిదకి ఆ భావి సమాధిగా మిగిలిపోయి ఉండేది కదా.

కాబట్టి ఫ్రెండ్స్ మన లైఫ్లో కొద్ది మంది వ్యక్తుల స్వార్ధం వల్ల మనకు వచ్చే కష్టాలకి, నష్టాలకి అలాగే ఇతరుల విమర్శలకి క్రుంగిపోకుండ, మన మనస్సుతో శక్తిని కేంద్రికరించుకొని, సమస్యనుండి బయటపడి విజేతగా నిలవాలి. అల్ ది బెస్ట్. 

Similar News