విజయంలో వినటం పాత్ర ఎంతో మీకు తెలుసా?

Update: 2019-08-17 07:47 GMT

విజయంలో వినటం పాత్ర ఎంతో మీకు తెలుసా?

ఒక స్కూల్ లో టీచర్.... తమ పిల్లలకు... ఒక ప్రాబ్లం చెపుతూ.....

పాపయ్య...ఒక మటన్ దుకాణంలో పని చేస్తాడు. అతని ఎత్తు 5'6. అతని నడుము 36 అంగుళాలు. అతను రోజుకు 10 గంటలు పనిచేశాడు మరియు 50 రూపాయలు సంపాదించాడు. రోజుకు. అతను రోజు కొలిచే బరువు ఏమిటి? అని అడిగింది...

వెంబడే... విద్యార్ధులు...అంకెల మధ్య గుణించడం, విభజించడం, జోడించడం, తీసివేయడం మరియు వాటి సంబంధాన్ని కనుగొనడం ద్వారా పాపయ్య యొక్క బరువును లెక్కించడం ప్రారంభించారు.

అప్పుడు ఒక్క శ్యాం మాత్రమే లేచి నిలబడి, "మామ్, అతను రోజు మాంసం బరువు కొలుస్తాడు" అని అన్నాడు. విద్యర్తులంతా తమ మనస్సుని అతని శరీర బరువు ఏమిటి , అనే ప్రశ్న తో ఆలోచిస్తుంటే..ఒక శ్యాం మాత్రమే అలా చెప్పడానికి కారణం అతను వినే విధానం. అందుకే ఇంగ్లిష్ లో Hearing, మరియు Listening అనే రెండు పదాలు వున్నాయి. మన రోజు వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన పని మనం చేసేది, ఇతరులతో సంభాషించటం.

దీనినే మనం కమ్యునికేషన్ స్కిల్ అని లేదా భావ వ్యక్తీకరణ అని అంటున్టాము. మొత్తం మన భావ వ్యక్తీకరణలో మాట్లాడటం కన్నా, వినటం శాతం సగం కన్నా కూడా ఎక్కువ అవుతుంది. కానీ చాలామంది వారికీ మాట్లాడటము వస్తే చాలు అనుకుంటారు. కాని మాట్లాడటం విజయానికి సగం మాత్రమే సహాయపడుతుంది. అయితే మిగిలింది ఇతరులకు చెప్పే విషయాన్ని సవ్యంగా, సరైన విధంగా వినడమే ....అత్యంత ఎక్కువ శాతం. దాదాపు రోజులో సగం కన్నా ఎక్కువ సమయం, ఇతరులు చెప్పే విషయాలను వినడానికే మనం సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ వినటాన్ని ఒక శబ్దంలా వింటున్నారా లేదా పూర్తి ఏకాగ్రతతో, శ్రవణం అనేలా వింటున్నారా అనేది చాలా ముఖ్యం. ఎవరైతే పూర్తి ద్యాస తో వింటారో వాళ్లు విషయం యొక్క లోతుని కనిపెట్టగలరు, అలాగే వాళ్లే విజేతగా నిలవగలరు. అల్ ది బెస్ట్. 

Tags:    

Similar News