ఆలస్యం కావచ్చు కానీ.. వానలకు లోటుండదు!

Update: 2020-05-26 08:37 GMT

మేఘం కరిగేను...చినుకై కురిసేను అంటూ తొలికరి జల్లలు నేల రాలబోతున్నాయి. భానుడి వేడికి పుడమి భగభగలాడుతున్న వేళ వరుణిడి కరుణతో వానలు కురవబోతున్నాయి. రుతుపవనాల రాక ఈ సారి కొద్దిగా ఆలస్యం అయినా దేశంలో మంచి వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు వున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రుతుపవనాల రాక రెండు రోజులు ఆలస్యం అయినా మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చల్లని కబురు అందిస్తున్నారు. భారత దేశంలో కాలమానం ప్రకారం మే నెలాఖరుకి జూన్ మెదటి వారం నుండి వర్షాకాలం ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ వరకు నాలుగు నెలల పాటు రెయినీ సీజన్ వుంటుంది. దేశానికి కావాల్సిన వర్షపాతం 75% నుండి 80% ఈ సీజన్ లోనే లభిస్తుంది.

దక్షిణార్ధగోళంలో సముద్ర భాగం ఎక్కువుగా వుటుంది. రుతుపవనాలు దక్షిణదిశ గానే ప్రారంభం అవుతాయి. రుతుపవనాలు వచ్చే ముందు రెండు భాగాలుగా విడిపోయి బంగాళాఖాతం, అరేబీయా సముద్రంలో ప్రవేశిస్తాయి. మే నెల 26 నుండి 28 తేదిలకు మెదట కేరళ ను రుతుపవనాలు తాకుతాయి. తరువాత జూన్ మొదటివారంలో అండమాన్ ను ఆనుకుంటాయి. అప్పటి నుండి దక్షిణాదిలో వర్షాలు మొదలవుతాయి.

60 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే సాధారణంగా కేరళ కు రుతుపవనాల వచ్చిన తరువాత నాలుగు లేదా ఐదురోజుల్లో అండమాన్ ను తాకుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తరువాత 7 నుండి 8 స్పెర్ల్స్ రైన్స్ తో భారతదేశం అంతా వ్యాపిస్తాయి. ఈ ఏడాది మాన్ సూన్ ఆన్ సెట్ అయ్యే ముందు సైక్లోన్ రావడంతో భూభాగం, సముద్ర తలం పై ఉష్ణోగ్రతల్లో తేడాలు రావడం వలన నాలుగురోజులు ఆలస్యంగా రుతుపవనాలు అండమాన్ ను తాకుతున్నాయి. ప్రస్తుతం వాతావరణ అనుకూలతలతో మంచి వర్షపాతం నమోదు అయ్యే అవకాశం వుందని, వాతావరణ కాలుష్యం తగ్గడం కూడా కలిసివస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదు అవుతుందన్న నిపుణుల అంచనా రైతుల్లో ఆనందం కలిగిస్తుంది.

Tags:    

Similar News