ఆర్టికల్ 370 రద్దు, సీఏఏపై పునరాలోచన చేయబోం : ప్రధాని మోదీ

దేశ ప్రయోజనాల కోసమే ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు.

Update: 2020-02-16 15:34 GMT
మోడీ ఫైల్ ఫోటో

దేశ ప్రయోజనాల కోసమే ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. ఆ విషయంలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తాము తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్టు వేగంగా పని చేస్తోందని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతతో వారణాసితో పాటు అన్ని దర్శనీయ స్థలాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

ప్రధాని మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా 30 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా జగద్గురు విశ్వారాధ్య గురుకులం శతాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 19 భాషల్లోకి అనువదించిన శ్రీ సిద్ధాంతి శిఖామణి గ్రంథాన్ని మోడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఆలయం నిర్మాణం చేసేందుకు ఏర్పాటైన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు.. 67 ఎకరాల భూమిని త్వరలోనే అప్పగిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత 63 అడుగుల ఎత్తైన దీన్ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే సమయంలో.. కాశీ ఇండోర్‌ మహాకాళ్‌ ఎక్స్‌ప్రెస్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అలాగే కాశీ ఏక్ రూప్ అనేక్ అనే ఎగ్జిబిషన్‌ను మోడీ ప్రారంభించి.. సందర్శించారు. 

Tags:    

Similar News