మానవ హక్కుల ఉల్లంఘనలో యూపీ టాప్!

ఈరోజు మానవ హక్కుల దినోత్సవం.

Update: 2019-12-10 04:23 GMT
Human Rights Day 2019

అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం ఈరోజు (10. 12. 2019). ఐక్యరాజ్యసమితి 1948 లో మానవ హక్కులు పరిరక్షించడం కోసం.. మానవ హక్కుల పరిరక్షణపై అవగాహన పెంపిండించడం కోసం ప్రపంచ దేశాలలో కృషి జరగాలనే అభిలాషతో డిసెంబర్ 10 వ తేదీని మానవ హక్కుల పరిరక్షణ దినంగా ప్రకటించింది. అప్పట్నుంచీ ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని జర్పుకుంటూ వస్తున్నారు.

ఇక మన దేశంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) ఏర్పాటు చేశారు. మన దేశంలో మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి ఈ కమిషన్ విశేషంగా కృషి చేస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన సందర్భంలో ఈ కమిషన్ ఆ వ్యవహారాలకు సంబంధించి దర్యాప్తు జరుపుతుంది. బాధితుల నుంచి అందిన ఫిర్యాదులు, వార్తాపత్రికల్లో వచ్చిన సమాచారం, మీడియాలో వచ్చిన కథనాలు ఆధారంగా మానవహక్కుల కమిషన్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.

జాతీయ మానవ హక్కుల కమిషన్ 2016-17 సంవత్సరాలకు గాను ఇచ్చిన సమాచారం ప్రకారం.. మన దేశంలో అత్యధిక మానవ హక్కుల ఉల్లంఘన కేసులు ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ నివేదిక ప్రకారం దేశమంతా దాదాపుగా ప్రతి సంవత్సరం 90 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వాటిలో 40 వేల వరకూ యూపీలోనే నమోదవుతున్నాయట.

ఆ నివేదిక ప్రకారం.. 42,590 కేసుల నమోదుతో యూపీ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఒడిశా 8,750, ఢిల్లీ 6,368, హరియాణా 4,596, బిహార్‌ 3,765 ఉన్నాయి. 928 కేసులతో తెలంగాణ 17వ స్థానం, 1,250 కేసులతో ఏపీ 10వ స్థానంలో నిలిచింది. 


Tags:    

Similar News