ప్రభుత్వ ఉద్యోగి చేత షూ లేస్ కట్టించుకున్న మంత్రి..

Update: 2019-06-22 12:08 GMT

యూపీ మంత్రి లక్ష్మీ నారాయణ వ్యవహారశైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. యూపీలో షాజహాన్‌పూర్‌లో నిన్న జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్ని తిరిగి వస్తున్నలక్ష్మీనారాయణ షూ లేస్ ఊడిపోయింది. వెంటనే పక్కన ఉన్న ఉద్యోగి ముందుకు వచ్చి ఆయన షూ లేస్‌ కట్టాడు. ఈ వీడియోను ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చాలామంది నెటిజన్లు మంత్రిపై దుమ్మెత్తి పోశారు. ప్రభుత్వ ఉద్యోగి చేత షూ లేసులు కట్టించుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.


  

Tags:    

Similar News