45 రోజుల్లో కేసు విచారణ పూర్తి చేయాలి: సుప్రీంకోర్టు

Update: 2019-08-01 11:41 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ‌ లో దాఖలైన ఐదు కేసుల విచారణను ఢిల్లీకి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలి కుటుంబానికి సీఆర్పీఎఫ్ ద్వారా రక్షణ కల్పించాలన్న సుప్రీం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఉన్నవ్ బాధితురాలు, వారి తరపున ఇద్దరు న్యాయవాదులకు మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అనుమతితో ఢిల్లీకి తరలించాలని ఆదేశించింది. బాధిత కుటుంబానికి రూ.25లక్షల మధ్యంతర పరిహారం అందజేయాలని ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేసు విచారణను 45రోజుల లోపు పూర్తి చేయాలని రోజువారీ విచారణ జరపాలని సుప్రీం ఆదేశించింది. 

Tags:    

Similar News