BJP: రేపు కేంద్ర మంత్రి మండలి సమావేశం

BJP: నాయకత్వ మార్పు జరిగితే బండి సంజయ్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు?

Update: 2023-07-02 11:08 GMT

BJP: రేపు కేంద్రమంత్రిమండలి సమావేశం

BJP: రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో నాయకత్వంతో పాటు కేంద్ర కేబినెట్‌లోనూ మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రేపు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరగబోయే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో... మార్పులు చేర్పులపై చర్చించే అవకాశం ఉంది..

కేంద్ర మంత్రివర్గంలో గత రెండేళ్లుగా భారీ పునర్వ్యవస్థీకరణ జరగలేదు. మేలో న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు స్థానంలో అర్జున్‌ రాం మేఘవాల్‌కు బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు.. 2021 జులైలో జరిగిన ప్రక్షాళనలో 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికి 17 మంది మంత్రులకు కొత్తగా స్థానం కల్పించారు. ఈసారి కేబినెట్‌లో మార్పులు జరిగితే ఎంతమందికి చేయిస్తారు..? ఎంతమందికి ఛాన్స్ ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

జులై మూడో వారంలో పార్లమెంట్ సమావేశాలు కూడా జరగనుండటంతో.. కేబినెట్‌ భేటీలో పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలున్నాయి. ఉమ్మడి పౌరస్మృతిపైనా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే అభిప్రాయ సేకరణ కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలోనూ కేబినెట్‌లో చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News