ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు.. ప్రతి జిల్లా ఆసుపత్రిలో..

ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు కేటాయిస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Update: 2020-02-01 06:56 GMT
ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు.. ప్రతి జిల్లా ఆసుపత్రిలో..

ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు కేటాయిస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2025 నాటికి క్షయ వ్యాధి నివారణే ధ్యేయమన్నారు. 'టీబీ హారేగా.. దేశ్ జీతేగా' (టీబీ ఓడిపోతుంది.. దేశం గెలుస్తుంది) అనే కార్యక్రమాన్ని 2025 వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా ఆసుపత్రిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. చౌక ధరలకే మందులు లభించే జనఔషధీ కేంద్రాలను దేశంలోని అన్ని జిల్లాలకు విస్తారిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలను ఓడీఎఫ్‌లుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

Tags:    

Similar News