ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కరోనా ఎక్కువగా వస్తుందంటే?

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది.

Update: 2020-03-19 14:01 GMT
Representational Image

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 వేల మంది ప్రాణాలు కోల్పోగా లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇక గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 169కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక ఇది ఇలా ఉంటే కరోనా ఎక్కువగా ఏ బ్లడ్ గ్రూప్ వారికి సోకుతుందని చైనా శాస్త్రవేత్తలు అధ్యయనం చేయగా 'గ్రూప్ ఎ' రక్తం వారికి ఎక్కువగా సోకే ప్రమాదం ఉందని గుర్తించారు.

ఇప్పటికే చైనాలోని వుహాన్‌లో ఈ అధ్యయనం సాగగా, 'గ్రూప్ ఎ' ఉన్నవారు ఎక్కువగా ఉండగా, 'ఒ గ్రూపు' రక్తం ఉన్నవారు కూడా 25 శాతం వరకూ మరణించే అవకాశాలున్నాయని పరిశోధనలో వెల్లడైంది. వూహాన్‌లోని జనాభాలో 32 శాతం మంది 'గ్రూప్ ఎ' రక్తం ఉన్నవారే కావడం విశేషం.. మొత్తం చైనాలోని వూహాన్‌లో 2173 మందికి కరోనా సోకగా అందులో 206 మంది చనిపోయారు.

అయితే అందులోనూ 'ఎ బ్లడ్' గ్రూపు ఉన్నవారు 85 మందికి ఉండగా, 'ఒ బ్లడ్' గ్రూపు ఉన్నవారు 52 మంది ఉన్నారని వైద్యులు గుర్తించారు. 11మిలియన్ జనాభా ఉన్న వుహాన్ నగరంలో ఆరోగ్యవంతుల్లో 34 శాతం మందికి టైప్ 'గ్రూప్ ఎ' రక్తం ఉంది. 

Tags:    

Similar News