సచిన్‌, విరాట్ కోహ్లీ గురించి ట్రంప్ ఏమన్నారంటే

మోతెరా స్టేడియంలో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్బంగా టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్, అలాగే ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆయన ప్రశంసించారు.

Update: 2020-02-24 09:58 GMT
Donald Trump

ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న రాడికల్‌ ఇస్లాం పేరుతో ఉన్న ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటామని ట్రంప్ అన్నారు. ఐసిస్‌ ఛీప్‌ మరణం ప్రపంచానికి ఊరటని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌ చర్యలు ఉపయుక్తంగానే ఉన్నాయని ట్రంప్ తెలిపారు. మోతెరా స్టేడియంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

గాంధీ ఆశ్రమాన్ని సందర్శించడం నాతో గొప్ప స్ఫూర్తిని నింపిందని, మహాత్ముడిని స్మరిస్తూ.. రాజ్ ఘాట్ ను సందర్శిస్తానని తెలిపారు. నిరుద్యోగాన్ని పారదోలే ప్రయత్నం నిరంతరం చేస్తున్నామని ట్రంప్ అన్నారు. సాయంత్రం ప్రపంచ ప్రఖ్యాతగావించిన ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను సందర్శిస్తాను. ‎అమెరికా, భారత్‌ మూడు బిలియన్‌ అమెరికా డాలర్ల రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంటామని వెల్లడించారు. అత్యాధునికమైన ఆయుధాలు., విమానాలు కొనుగోలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నామని తెలిపారు. మోదీ వేగవంతమైన సంస్కరణలతోపాటు, వాణిజ్యంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. వ్యోమగాముల శిక్షణ, అంతరిక్ష రంగంలోనూ కలిసి పనిచేస్తామని తెలిపారు. ‎

భారత్‌ సచిన్‌ నుంచి విరాట్‌ కోహ్లీ గొప్ప క్రికెటర్లని ట్రంప్ అన్నారు. అలాంటి క్రికెటర్లు భారత్‌కు ఎన్నో విజయాలు అందించారని, ఇప్పటి భారత్ వరకూ గొప్ప క్రీడాకారులను అందించిందని ప్రశంసించారు. భారత్ అద్భుతమైన అవకాశాలకు నెలవని అన్నారు. ఏడాదికి భారత్‌కు 2వేల సినిమాలను నిర్మిస్తోంది. ప్రజాస్వామ్య దేశంగానే భారత్‌ విజయాలు సాధించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ పురోగమిస్తోంది. అమెరికన్లు భారత్‌ను ప్రేమిస్తారిని ట్రంప్ మోతెరాలో ప్రసంగించారు.

టీమిండియా తరపున సచిన్ 200 టెస్టులు ఆడాడు. 51 శతకాలతో పాటు , 68 అర్థశతకాలు 15,921 పరుగులు ఉన్నాయి. అలాగే 463 వన్డేల్లో 49 శతకాలు, 96 అర్థశతకాలు 18,426 పరుగులు సాధించారు. వన్డేల్లో 200 పరుగు సాధించిన తొలి క్రికెటర్ గా సచిన్ రికార్డు సాధించారు. విరాట్ కోహ్లీ ప్రస్థుత టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్నారు. సచిన్ తర్వాత ఎన్నో ఘనతలు కోహ్లీ సృష్టించాడు. 248 వన్డేల్లో 11 867 పరుగులతో కోహ్లీ 43 శతకాలు సాధించాడు. 

 

Full View


Tags:    

Similar News