పాటలతో ట్రాఫిక్ నియంత్రణ

పట్టణాలలోని రహదారులను చూస్తే చాలు అంతా గజీ బిజీగా ఎక్కడ చూసినా ట్రాఫిక్ తో కిట కిట లాడుతూ ఉంటుంది. అలాంటి ట్రాఫిక్ ను నియంత్రించడం అంటే చాల కష్టం.

Update: 2019-10-20 08:16 GMT

పట్టణాలలోని రహదారులను చూస్తే చాలు అంతా గజీ బిజీగా ఎక్కడ చూసినా ట్రాఫిక్ తో కిట కిట లాడుతూ ఉంటుంది. అలాంటి ట్రాఫిక్ ను నియంత్రించడం అంటే చాల కష్టం. అలాంటిది కొందరు ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఎంత కష్టమైనా ఆ పనిని ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ వారి బాధ్యతలను నిర్వహిస్తుంటారు. ఇదే పధ్ధతిలో ఒక ట్రాఫిక్ పోలీస్ ఏం చేసాడో తెలుసా..!

ట్రాఫిక్ జామ్ కాకుండా వినూత్న ప్రయత్నాలు చేసి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అంతే కాదండీ ట్రాఫిక్ నిబంధనలపైన ప్రయాణికులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అతనే చండీగఢ్ కు చెందిన ట్రాఫిక్ పోలీస్ భూపిందర్ సింగ్.

అతను దలేర్ మెహందిలోని 'బోలో తారా రారా' అనే పాట పాడుతూ ట్రాఫిక్ నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. దీంతో ఆ ట్రాఫిక్ పోలీస్ కాస్త సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. గతంలోనూ ఆయన డ్రంకెన్ డ్రైవింగ్, రోడ్డు భద్రతా నియమాలపై ఇటువంటి పాటల ద్వారానే అవగాహన కల్పించారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలతో ట్రాఫిక్ నిబంధనల గురించి చెపితే ప్రజలు శ్రద్ధగా విని నేర్చుకుంటున్నారని తెలిపారు.



Tags:    

Similar News