సబర్మతి ఆశ్రమంలోనూ.. మోదీ జపమేనా !

అహ్మాదాబాద్‌లో సబర్మతి ఆశ్రమంలో కూడా ట్రంప్ మోదీకి ధన్యవాదాలు తెలిపేందుకే మొగ్గు చూపారు.

Update: 2020-02-24 09:05 GMT
To my great friend Modi what donald trump wrote in visitors-book

భారత పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోదీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అహ్మాదాబాద్‌లో సబర్మతి ఆశ్రమంలో కూడా ట్రంప్ మోదీకి ధన్యవాదాలు తెలిపేందుకే మొగ్గు చూపారు. మహాత్మా గాంధీ ఆశ్రమ సందర్శనలో భాగంగా.. గాందీ సందేశాన్ని వినిపించడమో, లేక గాంధీకి నివాళులు అర్పించడమో కంటే ప్రధాని మోదీ ప్రసంగించడంవైపే దృష్టి పెట్టారు.

ప్రధానికి కృతఙ్ఞతలు తెలుపుతూ.. "TO MY GREAT FRIEND PRIME MINISTER MODI – THANK YOU FOR THIS WONDERFUL VISIT" అని రాశారు. సబర్మతి ఆశ్రమంలో విజిటర్స్ డైరీలో. ట్రంప్‌ గాంధీని విస్మరించినందుకు పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తు్న్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అహ్మదాబాద్ చేరుకున్నారు. స్వాగత కార్యక్రమాల ముగిసిన తర్వాత నేరుగా.. గాంధీజీ 12 ఏళ్ల పాటు నివాసమున్న సబర్మతి ఆశ్రమానికి తన సతీమణి మెలానియాతో సహా సందర్శించారు. ప్రధాన మంత్రి మోదీ గైడెన్స్‌లో ట్రంప్, సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. గాంధీ పటానికి నూలు దండతో నివాళులు అర్పించారు. ఆశ్రమంలోనే ఉన్న చరఖాపై నూలు వడిచేందుకు ట్రంప్ ప్రయత్నించారు.

సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన అనంతరం ప్రముఖులు అక్కడ డైరీలో ఏదో ఒక సందేశాన్నో, అనుభవాన్నో, గాంధీ మెమొరీలో రాయాల్సి ఉంది. ట్రంప్ మాత్రం అందుకు భిన్నంగా రాశారు. గాంధీ గురించి కాకుండా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ..డైరీలో రాశారు. ట్రంప్, మోదీ ఆశ్రమం నుంచి వెళ్ళిన తర్వాత ట్రంప్ రాసిన సందేశాన్ని ఆశ్రమ నిర్వాహకులు మీడియాకు ప్రదర్శించారు.


Tags:    

Similar News