Himachal: హిమాచల్ వరదల్లో చిక్కుకున్న ఉస్మానియా డాక్టర్లు ..
Himachal: వరదల్లో చిక్కుకున్న వైద్యుల గురించి మంత్రి హరీష్‌రావు ఆరా
Himachal: హిమాచల్ వరదల్లో చిక్కుకున్న ముగ్గురు వైద్యులు
Himachal: హిమాచల్ వరదల్లో తెలంగాణకు చెందిన ముగ్గురు వైద్యులు చిక్కుకున్నారు. మనాలి టూర్‌కు వెళ్లిన ఉస్మానియాకు చెందిన ముగ్గురు డాక్టర్లు ప్రమాదవశాత్తు వరదల్లో చిక్కుకున్నారు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో..వైద్యుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వరదల్లో చిక్కుకున్న ముగ్గురు డాక్టర్లు బానోత్ కమల్ లాల్ రోహిత్ సూరి, శ్రీనివాస్ గురించి మంత్రి హరీష్‌రావు ఆరా తీశారు. వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు మంత్రి హరీష్.